Saturday, November 23, 2024

పిఎ తిరుపతిపై వచ్చిన ఆరోపణలపై కెటిఆర్ క్లారిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో తన పిఎ తిరుపతిపై వస్తోన్న ఆరోపణలను మంత్రి కెటిఆర్ ఖండించారు. సోమవారం సిరిసిల్లలో నిర్వహించిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ టిఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు అమ్ముకున్నట్లు తిరుపతిపై వచ్చిన ఆరోపణలపై మంత్రి కెటిఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. లీకేజీకి తాను బాధ్యత వహించాలని, అందులో తన పిఎ తిరుపతి ఉన్నారని, పేపర్ అమ్ముకున్నాడని ఆధారాల్లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా?, పేపర్ లీకేజ్ కేసులో సిఎం బ్రోకర్ అని బండి సంజయ్ అన్నారని, అదానీకి మోడీ బ్రోకర్ అని తాను చెప్పవచ్చని కానీ, చెప్పనని కెటిఆర్ అన్నారు. జీవితంలో ఒక్కసారైనా సంజయ్, రేవంత్ పరీక్షలు రాశారా అని కెటిఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్ ఎంపి నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దొరికిపోలేదా అని కెటిఆర్ నిలదీశారు. మల్యాల మండలంలో 415 మంది పరీక్షకు హాజరైతే 35 మంది మాత్రమే గ్రూప్-1 నుంచి అర్హత సాధించారని కెటిఆర్ తెలిపారు. తిరుపతి స్వగ్రామంలో ముగ్గురు పరీక్ష రాస్తే ఒక్కరు కూడా అర్హత సాధించలేదని కెటిఆర్ వివరించారు.

సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది గ్రూప్-1 పరీక్ష రాశారని అందులో 255 మందికి 25 నుంచి 90 మార్కులు వచ్చాయని కెటిఆర్ తెలిపారు. జిల్లాలో ఒక్కరికీ కూడా 100 మార్కులు రాలేదని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్దాలు ప్రచారం చేస్తున్న విపక్ష నేతలు ఇప్పుడేం చేస్తారని కెటిఆర్ ప్రశ్నించారు.
గుజరాత్‌లో 8సంవత్సరాల్లో 13 పేపర్లు లీక్
రేవంత్‌రెడ్డి ఇప్పుడు నా పిఎ తిరుపతి వెంటపడ్డాడని, నా పిఎ ప్రశ్నపత్రాలు అమ్ముకున్నట్లు ఆరోపిస్తున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో 8సంవత్సరాల్లో 13 పేపర్లు లీకయ్యాయని సిఎం, మంత్రి, అధికారిగానీ పదవులు వదులుకోలేందుకని కెటిఆర్ నిలదీశారు. టిఎస్పీఎస్సీ అభ్యర్థులకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. పంట నష్టం జరిగితే ఎకరానికి ఎప్పుడూ లేని విధంగా 10 వేల రూపాయలు ప్రకటిస్తే లక్ష రూపాయలు ఇవ్వాలని బండి సంజయ్ అంటున్నా డని పిచ్చికుక్కల్లా మొరగకుండా మోడీతో మాట్లాడి ఇప్పిస్తే ఎవరూ అడ్డుకుంటున్నారని కెటిఆర్ బండి సంజయ్‌ను ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News