Sunday, November 24, 2024

ఇక వ్యవసాయ ప్రగతి

- Advertisement -
- Advertisement -
Minister KTR exclusive interview
ఆడబిడ్డలు, అన్నదాతలతో ఆత్మీయ సమావేశాలతో మొదలు
ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, దీనికోసం పార్టీశ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం
రేవంత్-ఈటల రహస్య ఒప్పందం
విభజన హామీలను విస్మరించిన కేంద్రం , రాష్ట్ర బిజెపి ఎంపిలు ఉత్త దద్దమ్మలు, స్వార్థంతోనే ఈటల పార్టీని వదిలాడు
రాష్ట్రంలోని 7580శాతం ప్రజలకు
సంక్షేమ పథకాలు అందుతున్నాయి గత
ప్రభుత్వం 60ఏళ్ల పాటు పాలించి
సాధించలేకపోయిన అద్భుతాలను సిఎం
కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం
సాధించింది ఏరాష్ట్రంలో లేని రీతిలో
కల్యాణలక్ష్మిని కొనసాగిస్తోంది 24
గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తోంది
ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు
ఏర్పాటు చేసి ప్రతి గింజను రైతుల వద్ద
నుంచి కొంటోంది కెసిఆర్ డిక్టేటర్
కాదు, గాంధేయవాదంతోనే పాలన :
మనతెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక
ఇంటర్వూలో మంత్రి కెటిఆర్

రాష్ట్రంలో వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యత మరే రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో సుమారు 63 లక్షల మందికి రైతుబంధు పథకాన్ని అందిస్తున్నామన్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ. 12వేల కోట్లను ఖర్చు చేస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి, పట్టణ ప్రగతి మాదిరిగానే త్వరలో వ్యవసాయ ప్రగతిని కూడా నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. పల్లెప్రగతి…పట్టణ ప్రగతితో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. అందువల్ల ప్రత్యేకంగా వ్యవసాయ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా రైతులకు మరింత ప్రొత్సాహం కల్పించేందుకు అవకాశముంటుందన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు. దీని కోసం పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వారి ద్వారా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పెద్దఎత్తున ప్రచారం కల్పించస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సమగ్రంగా వివరిస్తామన్నారు. అలాగే ఆడబిడ్డలు, అన్నదాతలతో కూడా ఆత్మీయ సమావేశాలను కూడా నిర్వహించాలని యోచిస్తున్నామన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరి, విజయ గర్జన సభలను పురస్కరించుకుని శనివారం మన తెలంగాణ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కెటిఆర్ పలు అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు వ్యవసాయం దండగా అన్న తెలంగాణలో ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ రంగాన్ని పండుగగా చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు సిఎం కెసిఆర్ తీసుకున్నారన్నారు. తెలంగాణలో నిర్మించిన విధంగా రైతు వేదికలు, 2600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించిన రాష్ట్రం దేశంలో మరోటి లేదని కెటిఆర్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని 75 నుంచి 8-0 శాతం మంది ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని కెటిఆర్ తెలిపారు.

అరవై సంవత్సరాలుగా పాలించిన గత ప్రభుత్వం సాధించిన పలు అద్భుతమైన విజయాలను సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిందన్నారు. దీని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం తీసుకున్న ఆడబిడ్డలతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం కూడా నిర్వహిస్తామన్నారు. అలాగే పంటలకు సరిపడా సాగునీరు… 24 గం టల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు…. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు పండించిన పట్టకు గిట్టుబాటు ధరను కూడా సక్రమంగా చెల్లిస్తున్నది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. ఇలా అనేక రకాలుగా అన్నదాతలను కంటికి రెప్పలా కాపాడుతున్న వారితో ప్రత్యేక ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇకపై పార్టీ పటిష్టతపై నజర్

ఇప్పటి వరకు ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న లక్షంతో ప్రభుత్వ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని…ఇకపై పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచే అంశంపై దృష్టి సారించనున్నామని కెటిఆర్ తెలిపారు. ఇందుకు పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సమయాత్తం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 25వ తేదీన తలపెట్టిన పార్టీ ప్లీనరి సమావేశం…అలాగే వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో తలపెట్టిన విజయ గర్జన సభ అనంతరం పార్టీ పరంగా కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలు సుమారు తొమ్మిది నెలల పాటు కొనసాగే అవకాశముందన్నారు. ప్రధానంగా ప్లీనరి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అనంతరం… పూర్తి స్తాయిలో రాష్ట్ర కమిటీతో పాటు పలు అను కమిటీలను పూర్తి చేస్తామన్నారు.

తదనంతరం జిల్లా , అనుబంధ కమిటీల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. అలాగే సుమారు 26, 27 జిల్లాల్లో ఇప్పటికే పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి అయిందన్నారు. వాటన్నింటిని కూడా సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఒక రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుంటామన్నారు. తదనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులకు వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వివిధ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తామన్నారు. వారి ద్వారా క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులను కూడా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిన సమగ్రంగా వివరిస్తామన్నారు. తద్వారా ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించేందుకు అవకాశముంటుందన్నారు.

వాళ్లిద్దరి మధ్య రహస్య ఒప్పందం

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, హుజూరాబాద్ బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్ మధ్య రహస్య ఒప్పదం కుదిరిందని కెటిఆర్ ఆరోపించారు. ఇటీవల వారిద్దరు గోల్కొండ రిసార్టులో రహస్యంగా కలిశారన్నారు. తాను చేస్తున్న ఈ ఆరోపణను తప్పు అని ధైర్యం రేవంత్‌గానీ, ఈటల గానీ ఉందా? అని ప్రశ్నించారు. నిజంగా వారికి దమ్ముంటే తాను విసిరిన సవాల్‌పై స్పందించాలన్నారు. అవసరం వచ్చినప్పుడు వారిద్దరు కలిసిన ఫోటోలను కూడా బయటపెడతానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ టిఆర్‌ఎస్ ఓటమి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజురాబాద్‌లో ముమ్మాటికి గెలిచేది టిఆర్‌ఎస్ పార్టీయేనని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదన్నారు. బిజెపితో రేవంత్‌రెడ్డి మిలాఖత్ కావడం వల్లే ఈ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్ధిని బరిలోకి దించారన్నారు.

గాంధేయవాదంతోనే ముందుకు సాగుతున్నాం

సిఎం కెసిఆర్‌పై పరుశ పదజాలంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా… తాము మాత్రం గాంధేయవాదంతోనే ముందుకు సాగుతున్నామని కెటిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్‌ను ఇష్టానుసారంగా తిడుతున్నా…అందుకు తగు రీతిలోనే సమాధానం ఇస్తున్నామన్నారు. అదే పక్క రాష్ట్రం (ఎపి)లో సిఎం జగన్‌పై పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తే సదరు నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇటీవల మహరాష్ట్రలో సిఎంను చెంపదెబ్బ కొట్టినా తప్పులేదని విమర్శ చేసిన ఒక కేంద్రమంత్రిని అరెస్టు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సిఎం కెసిఆర్ ఏ మాత్రం ఏనాడు ప్రతిపక్షాల చేసిన ఆరోపణలపై వ్యక్తిగతంగా కక్ష సాధించలేదన్నారు. అయితే కొందరు నేతలు భావ ప్రకటన స్వేచ్చను పూర్తిగా దుర్వినిగం చేస్తున్నారన్నారు.

సిఎం కెసిఆర్ ఒక నియంత్ర (డిక్టేటర్) అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ స్పందించారు. అధికారంలో ఉన్న పార్టీకి కెసిఆర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాంటప్పుడు నాయకులను కంట్రోల్ చేయలేకపోతే కొన్ని సందర్భాల్లో దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందన్నారు. అందుకే కొన్ని సమయల్లో ఆయన కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తదునుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందులో ప్రతిపక్షాలకు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు. ఆ పార్టీల్లాగా నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు, ఘర్షణలకు పాల్పడితే మంచిదా? అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెసిఆర్ పిడికిలి ఎత్తే వరకు తెలంగాణకు గొంతు లేదు…నీరు కూడా లేదని కెటిఆర్ అన్నారు. ఒకప్పుడు తెలంగాణ యాస పట్ల చిన్న చూపు చూసిన వారంతా ప్రస్తుతం ఆ బాషనే ఓన్ చేసుకుని మాట్లాడుతున్నారన్నారు. ప్రధానంగా తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం తెలంగాణ బాష ట్రెండ్ కొనసాగుతోందన్నారు. అగ్రహీరోలు సైతం తెలంగాణ భాషను స్టైల్‌గా మాట్లాడే పరిస్థితి వచ్చిందన్నారు.

మోడీ చెప్పిందే చేస్తున్నాం

2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మో-డీ చెప్పిన విధంగా గ్యాస్ బండ్‌కు మొక్కి ఓటు వేయాలని హుజురాబాద్‌లో టిఆర్‌ఎస్ ప్రచారం చేస్తోందని కెటిఆర్ అన్నా రు. అప్పడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్‌ను పెంచిన గ్యాస్ ధరలపై ఈ విధంగానే వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రస్తుతం మోడీ హయంలో కూడా గ్యాస్ ధరలు రెండింతలు పెరిగాయన్నారు. దీనినే తమ అస్త్రంగా చేసుకుని హుజూరాబాద్‌లోని మహిళలు గ్యాస్ బండకు మొక్కుకుని టిఆర్‌ఎస్‌కు ఓటువేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని కెటిఆర్ ఆరోపించారు.

తెలంగాణకు రైల్వే కోచ్ ఇవ్వాలని తాము కేంద్రాన్ని అడిగితే…దేశంలో రైల్వే కోచ్‌అవసరం లేదని సమాధానమిచ్చిందన్నారు. అయితే మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా అక్కడ రైల్వే కోచ్‌ను మంజూరు చేయడమే కాకుండా దానిని ప్రారంభించడం కూడా పూర్తి అయిందన్నారు. అలాగే 2017లో మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రారంభించడానికి రాష్ట్రానికి వచ్చిన మోడీకి…కాళేశ్వరం, లేదా పాలమూరు ప్రాజెక్టులో ఏదైనా ఒక దానికి జాతీయ హోదా కల్పించాలని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వదని ప్రకటించిన మోడీ… సంవత్సరం క్రితం కర్నాటక రాష్ట్రంలో భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

రాష్ట్ర బిజెపి ఎంపిలు…ఉట్టి దద్దమ్మలు

అడ్డిమార్ గుడ్డి దెబ్బ తగిలినట్లు రాష్ట్రం నుంచి నలుగురు బిజెపి ఎంపిలు గెలిచినా…తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చూకూర్చే విధంగా ఏ రోజు వ్యవహరించ లేదన్నారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్…ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే పసుపుబోర్డును కేవలం ఐదు రోజుల్లో సాధిస్తాని బాండ్ కూడా రాసిచ్చారన్నారు. ఇప్పటి ఎన్నికలు ముగిసి దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పసుపుబోర్డును తీసుకరాలేకపోయారన్నారు. ఎంపి బండి సంజయ్ కరీంనగర్‌కు ఐఐఐటి తీసుకరావాలని పలుమార్లు అడిగినా ఉలుకుపలుకు లేకుండా పోయిందన్నారు. కనీసం కేంద్రం నుచి ఒక్క రూపాయి కూడా అదనంగా రాష్ట్రానికి తీసుకరాలేని దద్దమ్మ అని వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి…నిస్సాయ మంత్రిగా అభివర్ణించారు. ఆయన మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ కుటుంబం చేతిలో బంధి అయిందని వ్యాఖ్యానిస్తున్నారని….మరి కేంద్రం పూర్తిగా గుజరాతి చేతుల్లో బంధి అయిందన్న విషయాన్ని బహుషా కిషన్‌రెడ్డి మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇక ఆదిలాబాద్ ఎంపి సోయం బాబురావు ఇప్పటి వరకు గిరిజన యూనివర్సిటిని కూడా సాధించలేకపోయారన్నారు.

స్వార్థంతోనే టిఆర్‌ఎస్‌ను వీడిన ఈటల

తన స్వార్ధంతో ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్ వీడి బిజెపిలో చేరారని కెటిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్‌లో ఆయనకు ఎప్పుడు సముచిత స్థానమే లభించిందన్నారు. ఈటల ఒక మంత్రిగా కొనసాగుతూ ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే పనులు చేశారన్నారు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయవద్దన్న విషయం కూడా ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. కనీసం ఆయనపై వచ్చిన ఆరోపణలకు సిఎం కెసిఆర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. పైగా కెసిఆర్ పిలిచినా తాను వెళ్లేది లేదని ఈటలనే ముందుగా చెప్పుకున్నారన్నారు. ఆయన క్యాబినెట్‌లో ఉన్నప్పుడే దళిత బంధుకు శ్రీకారం చుట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా కెటిఆర్ తెలిపారు. బిజెపిలోకి వెళ్లినప్పటికీ ఆ పార్టీ ఆయనను ఓన్ చేసుకోవడం లేదన్నారు. అలాగే ఈటల కూడా ఆ పార్టీని ఓన్ చేసుకోలేకపోతున్నారన్నారు. అందుకే ఆయన అభిమానులు, అనుచరులు జై ఈటల అంటున్నారు తప్ప, జైశ్రీరామ్ అనట్లేదు ఎందుకు? అని ప్రశ్నించారు.

(కె.శ్రీనివాస్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News