- Advertisement -
ఆర్మూర్ లో ప్రచారరథం పైనుంచి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కిందపడబోయారు. ఆర్మూర్ లో జీవన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ప్రచారరథంలో కెటిఆర్ వెళ్తున్నారు. డ్రైవర్ అకస్మాతుగా బ్రేక్ వేయడంతో ప్రచారథం గ్రిల్ ఊడి ఆయన కిందపడ్డారు. కెటిఆర్ తో పాటు ఎంపి సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా కిందపడిపోయారు. ప్రచారరథం నుంచి కెటిఆర్ కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్ రెడ్డితో పాటు కెటిఆర్ నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు కెటిఆర్. తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
- Advertisement -