Tuesday, December 24, 2024

బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR filed defamation suit against Bandi Sanjay

తన న్యాయవాదితో లీగల్ నోటీసులు జారీ
48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌పై టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయ్‌కి నోటీసులు పంపించారు. ఈనెల 11వ తేదీన ట్విట్టర్ వేదిక ద్వారా తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన బండిపై కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలపై దమ్ముంటే బండి సంజయ్ ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని కెటిఆర్ ఘాటుగాహెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బండి సంజయ్ నుంచిఎటువంటి స్పందన రాకపోవడంతో శుక్రవారం కెటిఆర్ తన పక్షాన న్యాయవాదితో బండికి నోటీసులు జారీ చేశారు.

మంత్రి కెటిఆర్‌పైనిరాధార ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి ప్రజాజీవితంలో కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లయింట్ కెటిఆర్‌కు ఆపాదించే దురుద్దేశపూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది పేర్కొన్నారు. ఆయన పరువుకు నష్టం కలిగించేలా, అసత్యపూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్.. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కెటిఆర్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. వాటితో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లయింట్ కెటిఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాది వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News