Wednesday, December 25, 2024

కాంట్రాక్టర్లను వెంటనే మార్చండి.. మంత్రి కెటిఆర్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఐఐఐటీ బాసర క్యాంపస్‌లో ఇటీవల ఫుడ్‌పాయిజన్‌ ​​ఘటనలపై తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కే తారక రామారావు (కెటిఆర్‌) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బాసర ఐఐఐటీ కాన్వొకేషన్‌లో మంత్రి కెటిఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడిన మంత్రి కెటిఆర్.. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఐఐఐటీ అధికారులపై మండిపడ్డారు. మెస్ కాంట్రాక్టర్లను వెంటనే మార్చాలని వీసీని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. బాసర ప్రాంగణానికి సిఎం కెసిఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News