Thursday, January 23, 2025

ఎ టు జెడ్ అవినీతి

- Advertisement -
- Advertisement -

Minister KTR fires at MLA Komatireddy Rajagopalreddy in Assembly

మీదీ ఒక పార్టీయేనా?

కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డిపై శాసనభలో మంత్రి కెటిఆర్ ఫైర్, ఎంఎల్‌ఎ క్షమాపణ

మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చె ప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ నిప్పులు చె రిగారు. సోమవారం మధ్యాహ్నం ప ద్దులపై జరిగిన చర్చలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డిపై కెటిఆర్ మండిపడ్డారు. మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాల ని కెటిఆర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. బ డ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడు తూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టి.. కాంట్రాక్టుల్లో అవినీతి గురించే మా ట్లాడుతారు తప్ప ఇతర విషయాల గు రించి మాట్లాడరు అని తలసాని అన్నా రు. మళ్లీ రాజగోపాల్ రెడ్డి కల్పించుకొ ని మంత్రి తలసానిని ఉద్దేశించి పేకా ట ఆడినోళ్లు మంత్రులు కావొచ్చా? అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కోమటిరెడ్డిపై మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. క్రమంలో మంత్రి కెటిఆర్ కల్పించుకుని రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నాలుగు రోజుల నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ చాలా చక్కగా జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి ఫ్రస్టేషన్, వాళ్ల పార్టీ ఫ్రస్టేషన్ చాలా విచిత్రంగా ఉంది. బాధ్యతారాహిత్యంగా, కుసంస్కారంగా మాట్లాడుతున్నారు. శాసససభలోనూ, బయట అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ల పార్టీ అధ్యక్షుడు కూడా నోటికి హద్దు, అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. కెసిఆర్ ఆరోగ్యపరమైన సమస్య వచ్చి ఆస్పత్రికి వెళ్లారు. బిజెపి ఫలితాలను చూసి కెసిఆర్ ఆస్పత్రికి పోయిండు అని రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు.. ఇదేనా వీరి సంస్కారం అని ప్రశ్నించారు. పద్దుల మీద మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలన్నారు. అవినీతి అవినీతి అని గొంతు చించుకోవడం సరికాదని కెటిఆర్ పేర్కొన్నారు.

అసలు వీళ్లది ఏ పార్టీ అంటే..

అసలు వీళ్లది ఏ పార్టీ అంటే.. ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ భోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్, ఏ నుంచి జడ్ దాకా, ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్యులు.. దౌర్భాగ్య పార్టీ అది. అలాంటి వారు అవినీతి గురించి మాట్లాడటం సరికాదు. అవినీతి మీద ఆధారాలుంటే సివిసి, ఎసిబి, విజిలెన్స్, కోర్టులు ఉన్నాయి. గొంతులు చించుకోవడం, బట్టలు చింపుకోవడం కాదు. గాలి మాటలు మాట్లాడటం సరికాదు. ఒక బలహీనవర్గాల మంత్రిని పట్టుకొని పేకాట ఆడుతున్నావని అనడం దారుణమన్నారు. నోటికి హద్దు, అదుపు లేకుండా మాట్లాడిని రాజగోపాల్ రెడ్డి బేషరతుగా మంత్రికి క్షమాపణ చెప్పాలి. లేదంటే చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
తన వ్యాఖ్యలు ఉపసంహరించకుంటున్నాను.. తనను కాంట్రాక్టర్‌గా సంబోధించడంతోనే మంత్రిపై ఆ వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సభలో వెల్లడించారు.

పువ్వాడ వర్సెస్ భట్టి..

రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పేర్లను మార్చి అవినీతికి పాల్పడుతున్నారని రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తిప్పికొట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సీతమ్మసాగర్, సీతారామసాగర్‌లను చేపట్టారని, అదే కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం పేరుతో నిధులను స్వాహా చేశారని పువ్వాడ ఆరోపించారు. ఈ విషయమై సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క జోక్యం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాకు గోదావరి నీటి చుక్క రాలేదని ప్రతి విమర్శ చేశారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి తరపున మంత్రి హరీశ్‌రావుతో వివరణ ఇస్తామని చెప్పడంతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News