Thursday, January 23, 2025

‘బండి’ని మేం అడ్డుకోవడమా?

- Advertisement -
- Advertisement -

Minister KTR fires on Bandi Sanjay

వారిలా మేం దిగజారలేము

అబద్ధాలతో రాజకీయాలు మాకు చేతకావు టిఆర్‌ఎస్ రాజకీయ
విలువలకు లోబడి పనిచేసే పార్టీ ఆయనేదో మొరుగుతూ ఉంటే
పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు పేరుకే ప్రజా సంగ్రామ
యాత్ర.. ప్రజల నుంచి స్పందనే లేదు అది బండి చేస్తున్న తొండియాత్ర
పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా?
ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు
బండి మాటలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి కేంద్రం
తెలంగాణకు ఏం చేసిందో ముందుగా ప్పమనండి రాష్ట్ర విభజన
సమస్యలను ఇప్పటికీ పరిష్కరించలేదు.. ఢిల్లీ నాయకులను అడిగే
దమ్ము బండికి ఉందా? : టిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై ప్రత్యేక
సమావేశం తర్వాత మీడియాతో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న యాత్ర ను అడ్డుకునే ఖర్మ టిఆర్‌ఎస్‌కు పట్టలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బిజెపి నాయకుల మాదిరిగా తాము దిగజారిలేమన్నారు. వారిలా అబద్దాలు చెప్పుకుంటూ రాజకీయాల ను కొనసాగించడం లేదన్నారు. రాజకీయ విలువలకు లోబ డి టిఆర్‌ఎస్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతే తప్ప ఆయనే (బండి)దో మొరుగుతుంటే తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పే రిట బండి చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి స్పం దనే లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. అలాంటప్పుడు బండి చేస్తున్న యాత్రను పట్టించుకోవాల్సిన అవసరం తమకు ఎంత మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను, రాష్ట్ర ప్రభుత్వంపై నాలుగు ఆరోపణలు.. చేస్తే ఎంతోకొంత ప్రచారం వస్తుందన్న దుగ్ధ బండిలో కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే నోటికి ఇష్టంవచ్చినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు బుద్ది ఎలా చెప్పాలో రాష్ట్ర ప్రజలకు తెలుసున్నారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నగరంలోని హెచ్‌ఐసిసి ప్రాంగణంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా నేతలతో కెటిఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ సంజయ్‌పై మరోసారి నిప్పులు కురిపించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి, కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ బురదచల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుసుకునేందుకు బండి సం జయ్ తెలంగాణకు పొరుగున ఉన్న కర్నాటక సరిహద్దులోని రాయచర్‌కు వెళి ్లరావాలని కెటిఆర్ సూచించారు. తెలంగాణలో పాలన బాగుంది. పథకాలు చాలా బాగున్నాయని తమ ప్రాంతాన్ని కూడా తెలంగాణలో కలపమని అన్న బిజెపి రాయచూరు శాసనసభ్యుడుని కలిసి మాట్లాడాలని బండిని కెటిఆర్ కోరారు. అవసరమైతే బండి కోసం తామే స్వయంగా ఎసి కార్లను ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ బి జెపి నేతలకు కమిషన్లు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చే సుకుంటున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ ఆరోపించారు. అందువల్ల బండి సంజయ్ తన పాత్రను తెలంగాణలో కా కుండా కర్ణాటకలో చేయాలన్నారు. అప్పుడుగానీ బిజెపి రా ష్ట్ర పాలిత ప్రాంతాల్లో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉ న్నాయో తెలిసి ఉన్న అసమర్థ పాలనను చూసి సిగ్గు తెచ్చుకోవాలన్నారు.

ఏ ముఖం పెట్టుకుని యాత్రలు చేస్తున్నారు?

కేవలం రాజకీయ పబ్బం కోసం శ్రీరంగ నీతులు చెబుతున్న బండి…ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారని కెసిఆర్ ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా… లేక నదీ జలాల్లో వాటా తేల్చకుండా ఏడేళ్లలో శిఖండి సంస్థను ఏర్పాటు చేసి కేంద్రం తాత్సారం చేస్తున్నందుకా? అని మండిపడ్డారు. సంగ్రాయ యాత్రలో బండి మాటలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయే తప్పా ఇంకేం లేదన్నారు. ముందుగా కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో బండి చెప్పాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు. కనీసం రాష్ట్ర విభజన సమస్యలను కూడా ఇప్పటి కేంద్రం పరిష్కరించే లేదని…దీనిపై ఢిల్లీ నాయకులను అడిగే దమ్ము బండికి ఉందా? అని కెటిఆర్ నిలదీశారు.

రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకరాలేని బిజెపి దద్దమ్మలు…ఉత్తుత్తిగానే సిఎం కెసిఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలుచేసేందుకు యత్నిస్తుండడం వల్లే టిఆర్‌ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయనే తమ పార్టీకి చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చే దమ్ము బండికి ఉందా? అని నిలదీశారు. ఆయనదంతా సొల్లు పురాణం, అబద్ధపు మాటలు తప్పించి ఇంకేం లేదని కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఉచిత విద్య…. ఉచిత వైద్యం అంటున్న బండి సంజయ్‌కి కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరో తెలవదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. దీనిని దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్‌గానీ…. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు.

ప్రజల ఆకాంక్షకు ప్రతీక టిఆర్‌ఎస్

రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం రాజీలేకుండా పోరాడేది టిఆర్‌ఎస్ మాత్రమేనని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. ఈ నెల 27వ తేదీన నగరంలోని హెచ్‌ఐసిసిలో తలపెట్టిన పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నేతలకు ఆయన సూచించారు. ప్రతినిధుల సభకు ఆహ్వానితులు మాత్రమే రావాలని మరోసారి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.ఇది పార్టీ ప్రతినిధుల సభ మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. హెచ్‌ఐసిసిలో ప్రతినిధుల సభ ఏర్పాట్లను మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు…సంబంధిత అధికారులతో కెటిఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ, పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో కెటిఆర్ మాట్లాడుతూ, సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో తగు సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. అలాగే ప్రతినిధుల సభను విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

పార్టీ ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌లో జరుగుతున్నందున రాష్ట్రంలోని అన్ని గ్రామాల, మండలాలు, జిల్లాల నుంచి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకుంటారన్నారు. అందువల్ల వారికి ఎలాంటి అసౌకర్యలు కలుగుకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ కమిటీ పార్టీ జెండాను ఎగుర వేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులదేనని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ప్రతినిధుల సభకు హాజరయ్యే వారంతా 27వ తేదీన ఉదయం 10 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకోవాలని కెటిఆర్ సూచించారు. ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు ప్రతినిధుల వివరాల నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. 11.05 గంటలకు టిఆర్‌ఎస్ జెండాను పార్టీ అధినేత కెసిఆర్ ఆవిష్కరిస్తారన్నారు. సాయంత్రం 5 వరకు వివిధ అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుగుతాయన్నారు. ఈ సభ సందర్భంగా పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. వాటిల్లో ప్రధానంగా ఆహ్వాన కమిటీ, సభా ప్రాంగణం అంకరణ, ప్రతినిధుల నమోదు, వాలంటీర్ వ్యవస్థ, పార్కింగ్, ప్రతినిధుల భోజనం, తీర్మానాలు, మీడియా తదితర కమిటీలను ఏర్పాటు చేసినట్లు కెటిఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, వివేక్, శాసనమండలి సభ్యులు శంభీపూర్ రాజు, నవీన తదితరులు పాల్గొన్నారు.

ఆహ్వాన కమిటీ

మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఎంపి రంజిత్‌రెడ్డి
ఎంఎల్‌ఎలు గాంధీ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
సభా వేదిక…అలంకరణ కమిటి
ఎంఎల్‌ఎ మాగంటి గోపినాత్
వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
ప్రతినిధుల నమోదు కమిటి
ఎంఎల్‌సి శంభీపూర్ రాజ
చైర్మన్లు శ్రీధర్‌రెడ్డి, మన్నే కృషంక్
పార్కింగ్ కమిటీ
ఎంఎల్‌ఎ కెపి వివేక్
పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్,
జిహెచ్‌ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్
భోజన కమిటి
ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు
ఎంఎల్‌సి నవీన్‌కుమార్,
మాజీ శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి
తీర్మానాల కమిటీ
ఎంఎల్‌సి మధుసూదనాచారి
పార్టీ సీనియర్ నాయకుడు పర్యాద కృష్ణమూర్తి
మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి
మీడియా కమిటి
ప్రభుత్వ విప్ బాల్కసుమన్
ఎంఎల్‌సి భానుప్రసాద్
మాజీ ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News