Thursday, January 23, 2025

మా పల్లెలకు దీటా?

- Advertisement -
- Advertisement -

మోడీ ఇచ్చిన పైసలతోనే అభివృద్ధి జరిగి ఉంటే
దేశంలోని మిగతా గ్రామాలలో మా పల్లెల వెలుగేదీ?

తెలంగాణ అభివృద్ధి దేశ ప్రగతికి
సోపానం
కరీంనగర్‌కు రూ.1000కోట్లు
తీసుకురా.. బండికి కెటిఆర్
సవాల్ దళిత పక్షపాతి సిఎం
కెసిఅర్ దళితుల పట్ల ప్రతి
పక్షాలది కపట ప్రేమ
మేధామధనం తర్వాత
దళితబంధుకు శ్రీకారం
ఓర్వలేని కొంతమంది
అర్ధరహిత ఆరోపణలు
దళితబంధు నిధులతో రైస్‌మిల్లు కు శంకుస్థాపన సందర్భంగా
మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట: తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి అంతా మోడీ ఇచ్చిన పైసలతోనే జరిగినట్టు చెబుతున్న నేతలు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పల్లెల్లో ఈ స్థాయి అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపాలని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, కలెక్టర్ అనరాగ్ జయంతితో కలసి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ బిజెపి నేతలను సూటిగా ప్రశ్ని స్తూ.. దేశంలోని 6లక్షల పల్లెల్లో ఈ తరహా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయా అన్నా రు. తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇంతలా అభివృద్ధి జరిగితే అభినందించాల్సిందిపోయి, ప్రతిపక్షాలకు అక్కసు వెళ్లగక్కడం తగదన్నారు. అడ్డమై న మాటలు మాట్లాడటం మాని అభివృద్ధిలో పోటీపడాలని కెటిఆర్ హితవు పలికారు.

ఎంపి బండి సంజయ్‌కు దమ్ముంటే.. కరీంనగర్ పార్లమెంట్‌కు వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని కెటిఆర్ సవాల్ విసిరారు. దళితులు బాగుపడితేనే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశప్రగతికి సోపానంగా మారిందన్నారు. మేథోమధనం తర్వాత దారిద్య్రరేఖకు ఆమడదూరంలో ఉన్న దళిత సామాజికవర్గాన్ని త్వరితగతిన బాగు చేసేందుకే ముఖ్యమంత్రి దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి మార్గదర్శకులయ్యారన్నారు. రాజకీయ లబ్ది ఓట్ల కోసం కాకుండ దిశా నిర్దేశంచేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. కూలీల నుంచి ఓనర్లుగా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యాపార వేత్తలుగా దళితులు ఎదగాలని సూచించారు. దళితబంధు నిధులతో మరిమడ్ల రోడ్ అక్కపల్లి స్టేజీ వద్ద నిర్మించతలపెట్టిన రైస్ మిల్లుకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులు కలసికట్టుగా తమకు నచ్చిన యూనిట్లు పెట్టుకొని ఉపాధి పొందాలన్నారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొనుటకు ఇలాంటి మూకుమ్మడి నిర్ణయాలు హర్షనీయమన్నారు.

గడచిన 60 ఏండ్లలో దళితులు ఆర్థికంగా ఎదగ లేదన్నారు. అంతకు ముందు అయన మండల కేంద్రంలో సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రూ.30లక్షల స్వంత నిధులతో సిరిసిల్లకామారెడ్డి ప్రధాన రహదారిపై నిర్మించిన స్వాగత లవ్ సింబల్స్‌ను, కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన తల్లీబిడ్డల విగ్రహన్ని కెటిఆర్ అవిష్కరించారు. పాత బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కప్ సాసర్ ఫౌంటేన్, సాయిబాబా కమాన్ వద్ద రూ.11లక్షల జిపి నిధులతో నిర్మించిన దుకాణ సముదాయాన్ని ప్రారంభించారు. సుడిగాలి పర్యటనలో ప్రతికార్యకర్తను పేరుపేరున పలకరించి వారితో సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో జడ్పీటిసి చీటి లక్ష్మణ్ రావు జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ కో అప్షన్ సభ్యుడు చాంద్ పాష, ఎంపిపి రేణుకా కిషన్, ఎఎంసి చైర్మన్ కొండ రమేశ్ గౌడ్, ప్యాక్స్ చైర్మన క్రిష్ణా రెడ్డి, క్రిష్ణహరి, బండారి బాల్ రెడ్డి, నాయకులు అందె సుభాస్, గుల్లపల్లి నర్సింహరెడ్డి, బాలరాజ్ నర్సింహులుగౌడ్, ఎంపిటిసిలు ఎలుగందుల అనసూయ నర్సింహులు, ఉప్పుల మల్లేశం, ఆప్రా సుల్తానా మజీద్, కొత్తపల్లి పద్మ, సర్పంచ్‌లు తెడ్డు అమృత, కొత్తపల్లి వాణి, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News