Saturday, December 21, 2024

డ్రగ్స్ తీసుకోలేదని తేలితే.. చెప్పు దెబ్బలకు సిద్ధమా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన డ్రగ్స్ విమర్శలపై మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ పరీక్షల కోసం నా రక్తం ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించా రు. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే కరీంనగర్ చౌరస్తా లో చెప్పు దెబ్బలకు సిద్ధమా? అని బండికి కెటిఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా డ్రగ్స్ విమర్శలపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు కెటిఆర్ ఘాటుగానే స్పందించారు. డ్రగ్స్ పరీక్షలకు ఏది కావాలంటే అది ఇస్తా.. నేను క్లీన్‌చీట్‌తో బయటకు వస్తా.. అప్పుడు కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ చెప్పుదెబ్బలు తింటాడా అని ప్రశ్నించారు.

ఇందుకు ఆయన సిద్ధమైతే.. నేను ఇక్కడే ఉంటా.. రమ్మనమనండి.. ఏ డాక్టర్ను తీసుకొస్తాడో తీసుకురమ్మనమను.. డ్రగ్స్ పరీక్షల కోసం నా రక్తం ఇస్తాం.. వెంట్రుకలు ఇస్తా.. గోర్లు ఇస్తా.. కిడ్నీ ఇస్తా.. చర్మం కావాలన్నా ఇస్తా.. ఏం తీసుకుపోతాడో తీసుకువెళ్లమను.. డ్రగ్స్ పరీక్షల్లో నేను చిత్తశుద్ధితో బయటకు వస్తా.. అప్పడు కరీంనగర్ చౌరస్తా కమాన్ దగ్గర సంజయ్ తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా.. అని సవాల్ విసిరారు. ఆయన మాట్లాడే మాటలు, భాష బాగుందా..?, ఏమైనా తెలివి ఉందా..?, ఇదేం రాజకీయం.. మనిషా పశువా.. ఎంపిగా ముందు కరీంనగర్‌కు ఏం చేసిండో చెప్పాలి.. చేసిందేమీ లేదుకానీ, అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నాడని కెటిఆర్ ఘాటుగానే దెప్పిపొడిచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News