Sunday, November 24, 2024

కెసిఆర్ ను అసభ్యకరంగా దూషించారు.. బండి సంజయ్ ను ఏం చేయాలి?

- Advertisement -
- Advertisement -

ముంఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును లోక్ సభలో దూషించిన బండి సంజయ్ పై మంత్రి కెటిఆర్ మండిపడ్డారు.  “ప్రధాని ఇంటి పేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కెసిఆర్ ను లోక్ సభలో బండి సంజయ్ అసభ్యకరంగా దూషించారు. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఏం చేయాలి?. కెసిఆర్ ను దూషించిన బండి సంజయ్ ను మేము ఏం చేయాలి?” అంటూ ట్వీటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, గురువారం లోక్ సభలో బిజెపి ఎంపి బండి సంజయ్ మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బిఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని, తెలంగాణ సిఎం పేరు కాశీం చంద్రశేఖర్ రజ్వీ అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ సర్వనాశనం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత చనిపోతున్నా కెసిఆర్ పట్టించుకోలేదని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News