Friday, December 27, 2024

కేంద్ర మంత్రిపై కెటిఆర్ నజర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి ఎంపిలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆగ్రహం కనబర్చారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు విఫలం అయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ వాగ్దానం చేశారని, కానీ బిజెపి నేతలు ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీలను కేటాయిస్తుంటే, మరెందుకు మన రాష్ట్రానికి ఆ నేతలు కోచ్ ఫ్యాక్టరీని తీసుకురాలేకపోతున్నట్లు ఆయన ప్రశ్నించారు. అస్సాం రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీని రైల్వే శాఖ కేటాయిస్తున్నట్లు తెలిసింది.

అయితే అస్సాంకు కోచ్ ఫ్యాక్టరీని కేటాయించడం పట్ల సంతోషంగా ఉందన్న మంత్రి కెటిఆర్ తెలంగాణ బిజెపి నేతలు వెన్నుపూసలేని వారిగా తయారైనట్లు విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు దీనిపై బిజెపి నాయకులు వివరణ ఇవ్వాలని ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. భారతీయ రైల్వేశాఖ అస్సాంలోని కోక్రాజార్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపింది. ఆ ట్వీట్ ఆధారంగా మంత్రి కెటిఆర్ రాష్ట్ర బిజెపి నేతలను నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News