Monday, December 23, 2024

కేసు సిబిఐకి అప్పగిస్తే ‘బారా ఖూన్ మాఫే’నా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కోనుగోలు కేసును సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన సంబరాలు చే సుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి పార్టీ తీరుపైన బి ఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాక రామారావు మండిప డ్డారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసును సిబిఐకి అప్పగిస్తే ’బిజెపి విజయం’అని సంబరాలు చేసుకోవడంలో మర్మం ఏంటో చెప్పాలన్నారు. ఇన్నాళ్లు కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లిగా బయటకు వచ్చాయని, దొంగలు తమ నిజమైన రంగులు బయట పెట్టుకుం టున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కెటిఆర్ పలు ప్రశ్నలు సంధించారు. స్కాములో దొరికిన స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్నోళ్లు ఈ కుట్ర కేసు సిబిఐ కి అప్పగించగానే చంకలెందుకు గుద్దుకుంటున్నరని సూటిగా ప్రశ్నించారు. మీ బండారమంతా కెమెరా కన్నుకు చిక్కినప్పుడే మీ వెన్నులో వణుకు మొదలైందని, అప్పుడు భుజాలు తడుముకున్న మీరు ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారన్నారు.

మీకు ఏ సంబంధం లేకపోతే పలుమార్లు కోర్టుల్లో ఈ కేసు దర్యాప్తును అ డ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారన్న కెటిఆర్, సిబిఐకి అప్పగిస్తే అంత ఖుషీ ఎందుకు కిషన్ రెడ్డి , మీ జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా ఈ పట్టలేనంత సంతోషం? ’పంజరంలో చిలుక ’ మీరు చెప్పినట్టే పలుకుతుందని చెప్పకనే చెబుతున్నారా ? కేసు సిబిఐకి వెళితే మీ ’బారా ఖూన్ మాఫ్’ చేసి క్లీన్ చిట్ ఇవ్వడం పక్కా అని, ఇంత పబ్లిగ్గా మాట్లాడుతారా? సిబిఐ సహా వ్యవస్థల న్నింటినీ సంపూర్ణంగా భ్రష్టుపట్టించిన తీరుకు మీ

నిస్సిగ్గు ప్రకట నలే నిదర్శనం కాదా..?

అని ప్రశ్నించారు. ఒకప్పుడు సిబిఐకి కేసు ఇస్తే నిందితులు భయపడే పరిస్థితి ఉండేదని, ఇవ్వాళ సిబిఐకి కే సు అప్పజెప్తే సంబరాలు చేసుకుంటున్నారంటేనే, ఆ సంస్థను బిజె పి హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుందని అన్నారు. కెమెరాల సాక్షిగా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిన దొంగలు మీరని, రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు బిజెపి వ్యవహారం ఉందన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో బిజెపి కాంగ్రెస్‌నే మించిపోయిందని, ఒకప్పుడు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే వాళ్లని, ఇప్పుడు దేశప్రజలు సిబిఐని సెంట్రల్ బిజెపి ఇన్వెస్టిగేషన్ అంటున్నారన్నారు. సిబిఐ దర్యాప్తుతోపాటు దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమా? అని కెటిఆర్ సవాల్ విసిరారు. దొరికిన ముగ్గురు దొంగలకు లై డిటెక్టర్ టెస్టులు చేస్తే వాళ్లకూ, మీకు వున్న బంధం ఏంటో తేటతెల్లమైతది, మీరు దానికి సిద్ధంగా వున్నరా..?అన్న కెటిఆర్ దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు.

అధికార బలంతో ఏమైనా చేయొచ్చనే కుటిలనీతి బిజెపిదన్న కెటియార్, మీ ఎనిమిదిన్నరేళ్ల పాలనతో మీరు ప్రజాక్షేత్రంలో ఎప్పుడో బద్నాం అయిపోయారు. బిజెపిని కొత్తగా బద్నాం చేయాల్సిన ఖర్మ మాకు లేదని ఎద్దేవా చేశారు. బిజెపి దగ్గర విషయం లేదు కాబట్టే 8 ఏళ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో ‘విషప్రయోగం’ చేస్తున్న మాట నిజంకాదా? అన్న కెటిఆర్, బిజెపి దగ్గర సరుకు లేదు కాబట్టే, ఎంఎల్‌ఎలను అంగడి సరుకులా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా ఇక్కడా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రచేసి… ’ఆపరేషన్ లోటస్ ’ బెడిసి కొట్టి అడ్డంగా దొరికిన దొంగలు బిజెపి నేతలని మండిపడ్డారు.

ఈ దేశంలో గత ఎనిమిదేళ్లలో ప్రజాస్వ్యామ్య యుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన సిగ్గులేని చరిత్ర మీదని, దొంగలకు సద్దులు మోసిన బిజెపి నేతలు, ఇప్పడు సుద్దులు చెబితే నమ్మేదెవరన్నారు. మీ చేతిలోని కీలుబొమ్మలు సాగించే విచారణ ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్న కెటిఆర్, ఎంఎల్‌ఎల కొనుగొలు కుట్రల బండారంపై నిజమైన ప్రజాక్షేత్రంలో బిజెపిపై విచారణ ఎప్పుడో ప్రారంభం అయిందన్నారు. నేరం చేసిన వాళ్లు ప్రజా కోర్టులో తప్పించుకోలేరన్నారు. ఈ విషయంలో సరైన సమయంలో బిజెపిపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం కూడా సిద్ధంగా ఉందని కెటిఆర్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News