న తెలంగాణ/సిరిసిల్ల: కాంగ్రెస్‌కు ఎ ప్పుడో వారంటీ అయిపోయిందని, కాంగ్రెస్‌కు ఓటేసి అధికారం ఇస్తే మళ్లీ రాష్ట్రంలో చీకటి రోజులు వస్తాయని పురపాలక, ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బు ధవారం సిరిసిల్ల నియోజక వర్గంలోని గం భీరావుపేటలో నాలుగు గ్రామాల వారికి 378 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల్ల పంపిణీ, పలు అభివృద్ధి పనులకు శంకుస్థ్ధాపనలు చే సిన అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడా రు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువా త 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి 11సార్లు ఓటేసినా చేయని పనులు మరోసారి అవకాశం ఇస్తే చేస్తామనడాన్ని ప్రజ లు ఎలా నమ్ముతారని నిలదీశారు. అధికారం కోసం అర్రులు చాస్తూ కాంగెసోళ్లు ఆరు గ్యారంటీలు, ఆరవై గ్యారంటీలు అని వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వారంటీ అ యిపోయిందని చచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెసోళ్లు రోజుకు 24గంటలు కాదు 48 గంటలు ఉచిత కరెం ట్ ఇ స్తామంటారని, ఓట్లువేయించుకున్న తరువాత అన్నీ మర్చిపోతారన్నారు. కులమతాలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న పనికొచ్చే మనిషి, ప్రజల మనిషి సిఎం కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎంగా గెలిపించుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నా రు. కేంద్రంలో రాష్ట్రంలో ఢిల్లీ గల్లీలో అంత టా కాంగ్రెస్ ఉన్ననాడెన్నడన్నా ప్రజల సంక్షేమం
(మొదటిపేజీ తరువాయి)
కోసం పనులు చేసిన ముఖం కాంగ్రెస్‌కు ఉందా అన్నారు. పప్పు బెల్లాల్లా అన్నీ పంచుతామంటే ఎవరూ నమ్మరన్నారు. ప్రజలు దిక్కు మాలిన కాంగ్రెస్‌ను నమ్మి మొండి చెయ్యికి ఓటేస్తే మాత్రం ప్రజలకు ఆరు గ్యారంటీలు తప్పవని అన్నారు. అవేమిటంటే ఒకటోది రాష్ట్రం గాఢాంధకారంలో చిక్కుకుంటుందని, రైతులు మళ్లీ అర్ధరాత్రి కరెంట్ కోసం పొలాలకు వెళ్లక తప్పదన్నారు. రెండోది మంచినీళ్ల కోసం నీళ్ల ట్యాంకుల వద్ద మహిళలు యుద్ధాలు చేయక తప్పదన్నారు. మూడోది విత్తనాలు, ఎరువుల కోసం తిప్పలు తప్పవని రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగక తప్పదన్నారు. నాలుగోది సంవత్సరానికో సిఎం మారడం ఖాయమని, ఏడాదికో సిఎం చొప్పును ఐదుగురు సిఎంలు వస్తారని ప్రతి పనికి ఢిల్లీకి ఉరకక తప్పదని, సీల్డ్‌కవర్ రాజకీయాలు ఉంటాయన్నారు. ఆరోది విద్య, వైద్యం కోసం ఇబ్బందులు తప్పవన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు.
చత్తీస్‌గఢ్, రాజస్తాన్, కర్నాటకల్లో అధికారంలోఉన్న కాంగ్రెస్ అక్కడి ప్రజలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రజలు ఆగం కావద్దన్నారు. ఇతర రాష్ట్రాల్లో సంపాదించిన డబ్బు తీసుకుని బిజెపి, కాంగ్రెస్ నాయకులు వచ్చి పంచితే డబ్బుతీసుకుని కెసిఆర్ పార్టీకి ఓట్లు వేయమని కెటిఆర్ సూచించారు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీయాలని అన్నారు. రాష్ట్రంలో,దేశంలో ఎన్నికలంటే డబ్బు మయంగా మారిందని అయినా తాను ఎన్నికల్లో మందు, పైసలు పంచనని అన్నానని, మీ మీద నమ్మకంతోనే అన్నానని, పనికొచ్చే మనిషిని, పనిచేసే నాయకుడిని నన్ను గెలిపిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నారు. మీరు నన్ను గెలిపించినంతకాలం సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి సేవలు అందిస్తానన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతల మాయమాటలు నమ్మి మోసపోతే ఐదేండ్లు గోసపడుతారన్నారు. ఆత్మబంధువు కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎం చేయాలన్నారు. సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ నాయకులు తాను సిరిసిల్లలో ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తారని, పిసిసి నేత రేవంత్ రెడ్డి మాత్రం పనులు, పైసలన్నీ సిరిసిల్ల, సిద్దిపేటకే అంటాడని వీరిలో ఎవరి మాట నమ్మాలో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం ఏ రోటి కాడి పాట ఆ రోటికాడ పాడతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.