Wednesday, January 22, 2025

‘మోడీది సిగ్గులేని ప్రభుత్వం.. నడ్డాను ఎర్రగడ్డకు పంపాలి’: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Fires on JP Nadda

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారని, నడ్డాను ఎర్రగడకు పంపించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నిన్న హైదరాబాద్ కు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా  చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ”మోడీది సిగ్గులేని ప్రభుత్వం. చెప్పుకోవడానికి అరపైసా పని చేయని దిక్కుమాలిన ప్రభుత్వం. ఢిల్లీలో వడ్లు కొనరు.. ఇక్కడికొచ్చి దీక్షలు, ధర్నాలు చేస్తారు. జెపి నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నా. జెపి నడ్డా నువ్వో అబద్ధాల అడ్డా. బండి సంబయ్ కు.. జెపి నడ్డాకు పెద్ద తేడా లేదు. పంజాబ్ లో ప్రధాని మోడీని రైతులు అడ్డుకున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రధానికి ఈ దౌర్భగ్య పరిస్థితి ఎదురు కాలేదు. ప్రధాని మోడీ.. రైతు విరోధి. సిగ్గులేని, నీతిలేనిది మోడీ నేతృత్యంలోని ఎన్డీయే సర్కార్. కెసిఆర్ తెలంగాణ ఏటిఎం అంటున్నారు.. నిజమే, అన్నదాతలకు తోడుండే మిషన్ కెసిఆర్. మోడీ హయాంలో సబ్ కా సాత్ సబ్ కా వినాశ్. సామాన్యుడికి శోకం కార్పోరేట్లకు కనకాభిషేకం. కిసాన్ సమ్మాన్ పథకం ఎక్కడిది?. రైతుబంధును కాపీ కొట్టలేదా?. మా ప్రభుత్వ పథకాలు.. మీ ప్రచార అస్త్రాలు. నిన్న రైతులను రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారు” అని తీవ్రంగా మండిపడ్డారు.

Minister KTR Fires on JP Nadda

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News