Tuesday, November 5, 2024

బోర్డులు మీకు.. బోడిగుండ్లు మాకా?

- Advertisement -
- Advertisement -

మోడీ గుండెల్లో గుజరాత్.. తెలంగాణ గుండెల్లో గునపాలా?

ఎన్నాళ్లీ దగా.. ఇంకెన్నాళ్లీ మోసం గుజరాత్‌లో కొబ్బరి బోర్డ్ సెంటర్ ఏర్పాటుపై
మంత్రి కెటిఆర్ ట్వీట్ కేంద్రంపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్ : గుజరాత్‌కు బోర్డులు.. తెలంగాణకు బోడిగుండులా? అంటూ ప్రధాని నరేంద్రమోడీపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం తాజాగా గుజరాత్ రాష్ట్రానికి కొబ్బరి అభివృద్ధి బోర్డు సెంటర్‌ను మంజూరు చేసింది. దీనిపై ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనంపై కెటిఆర్ స్పందిస్తూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అందులో మోడీ సర్కార్‌ను తూర్పా ర పడుతూ, సెటైర్లు వేశారు. మోడీ గుండెల్లో గుజరాత్ తప్ప..తెలంగాణ రాష్ట్రం కనిపించడం లే దంటూ బిజెపి సర్కార్‌పై నిప్పులు కురిపించారు. ఆ రాష్ట్రాన్ని పువ్వుల్లో పెట్టి చుసుకుంటున్న మోడీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం గుణపాలు గుచ్చుతున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు. రంగాల్లో అభి-వృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అంటే మొదటి నుంచి మోడీ కడుపుమంటేనని కెటిఆర్ విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తెలంగాణ రాష్ట్రం సాధిస్తుండడాన్ని చూసి బిజెపి నేతలు తట్టుకోలేకపోతున్నారన్నా రు.

గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి తాము ఏనాడు అడ్డు చెప్పడం లేదని, ఆ రాష్ట్రానికి ఇస్తు న్న ప్రాధాన్యత ఇస్తున్న విధంగా తెలంగాణకు కూడా ఇవ్వాలని మాత్రమే కోరుకుంటున్నామన్నారు. ఏ తెలంగాణ రాష్ట్రం దేశంలో లేదా? అని కెటిఆర్ మరోసారి నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే దాని ప్రభావం కేంద్రంపై ఉండ దా? అని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివిక్షకు ఇంతకంటే నిదర్శనం ఇంకేమీ కావాలన్నారు. దీనిపై రాష్ట్రానికి బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇంకా ఎన్నాళ్లీ దగా…? ఇంకెన్నాళ్లీ మో సం? అని మండిపడ్డారు. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష పూరిత ధోరణిపై మంత్రి కెటిఆర్ పలు సందర్భాల్లో విరుచుకుపడ్డారు. అయినా కేంద్రంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. రాష్ట్రానికి ఎప్పటికప్పుడు రిక్తహస్తాలే చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ఒక ప్రధానిగా కాకుండా ఒక రాష్ట్రానికి చెందిన నాయకుడిగానే పాలన సాగిస్తున్నారంటూ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News