Wednesday, January 15, 2025

పెట్రో, డీజిల్ ధరల పెంపుపై మోడీపై మండిపడ్డ మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Fires on PM Modi over hike petrol

 

హైదరాబాద్: చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోడీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్‌లో పవర్ హాలీడే ప్రకటించడంపై బిజెపిపై సెటైర్లు వేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రో ధరలపై ఇప్పుడు గుజరాత్ సిఎంగా ఉన్న మోడీ, బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ చేసిన ట్వీట్స్ స్క్రీన్ షాట్స్‌ను కెటిఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

అప్పుడు పెట్రో ధరల పెంపుపై కేంద్రం విఫలం అన్న మోడీ.. ఇప్పుడెందుకు పెట్రో ధరలను పెంచుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం.. రాష్ట్రాలపై భారం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి.. అధికార అహంకారం.. పేదల అవసరాల పట్ల సానుభూతి లేనిది.. ఇవన్నీ మోడీ గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్స్ అని ట్వీట్ చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా 2019 నుంచి మూడేళ్లలో తెలంగాణలో 38 లక్షలకు పైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు ప్రధాని మోడీ ప్రకటనపై స్పందించిన కెటిఆర్.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. మిషన్‌భగీరథకు కేంద్రం నుంచి అందిన సహకారం సున్న అని చెప్పారు. సహకారం అందించకుండా ప్రచారం చేసుకోవడం ప్రధానమంత్రి స్థాయికి తగదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News