Sunday, December 22, 2024

50ఏళ్ల పాలనలో ఏం చేశారు?

- Advertisement -
- Advertisement -

మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?

అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు సమకూర్చలేని
దౌర్భగ్య ప్రభుత్వం కాంగ్రెస్‌దే రాహుల్‌గాంధీకి కనీస జ్ఞానం కూడా
లేదు వరంగల్ సభలో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు
అనువాదం చేసిన వద్ద మరో స్క్రిప్ట్ ఉంది దానికీ దీనికీ
పొంతన లేదు ప్రజలకు తాము ఏం సందేశం కూడా
రాహుల్‌కు తెలియదు అయనకు వడ్లు తెల్వదు.. ఎడ్లు తెల్వదు
మమ్మీ పార్టీ అధ్యక్షురాలైతే ఇయన డమ్మీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ
విధానం లేదనడానికి డిక్లరేషనే నిదర్శనం జాతీయ
పార్టీకి ఒక డిక్లరేషన్ ఉంటే ఎలా? ముఖ్యమంత్రి
కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమాలను సమంగా అమలుచేస్తూ
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు: వరంగల్‌లో
మంత్రి ఎర్రబెల్లి ఇంట మీడియాతో భేటీలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని అలాంటి వ్యక్తి తెలంగాణలో ప్రజాస్వామ్యం, రాజరికం గు రించి మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యంగ్యంగా విమర్శించా రు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలు ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలకు విచ్చేసిన మంత్రి కెటిఆర్, మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయనెవరో వరంగల్‌కు వచ్చారట.. ఆయనకున్న ప దవి ఏంటో ఏస్థాయిలో మాట్లాడుతున్నారో నాకు తెలియదని.. ఒకటి మాత్రం తనకు తెలుసన్నారు. మమ్మీ అధ్యక్షురాలు, ఆయన డమ్మీ అని విమర్శలను గుప్పించారు. ప్రజాస్వా మ్యం గురించి మాట్లాడే కనీస అర్హత రాహుల్‌కు లేదన్నారు. ప్రస్తుతం సోనియా అధ్యక్షురాలుగా ఉండి రాహుల్ డమ్మీగా ఆ పార్టీని నడిపిస్తున్నారన్నారు. గతంలో దేశానికి పేరుకే మన్మోహన్‌సింగ్ ప్రధాని అయినా సోనియాగాంధీ చేతిలో రిమోట్‌గా పనిచేశారన్నారు.

తెలంగాణలో ఒక్కసారి అవకాశమివ్వాలని రా హుల్ కోరినతీరు దయనీయంగా ఉందని కెటిఆర్ అన్నారు. 50 కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ప్రజలకు కావాల్సిన నీరు, క రెంటు, ఇతర వనరులను సమకూర్చలేని దౌ ర్భాగ్యపు ప్రభుత్వం కాంగ్రెస్‌దేనన్నారు. మరోసారి అవకాశమిస్తే ఏంచేస్తారని ఆయన ప్ర శ్నించారు. రాహుల్‌గాంధీకి కనీస జ్ఞానం లేదన్నారు. వరంగల్ సభలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివారని దాన్ని ట్రాన్స్‌లేట్ చేసిన వారి కి మరో స్క్రిప్టు ఉందని, దానికి దీనికి పొంతనలేక ఏం మేసేజ్ ఇచ్చామనేది కూడా రాహుల్ కు తెలియకుండా ఉందన్నారు.

రుణమాఫీ కాంగ్రెస్ పాలిత
రాష్ట్రాల్లో అమలు చేయాలి

కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలు గుర్తుకురాలేదా అని రాహుల్‌ను కెటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు అమలులాంటివి చెప్పిన రాహుల్ ముందుగా కాం గ్రెస్ రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల లో వాటిని అమలుచేసి చూపించాలన్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న రాహుల్‌గాంధీకి 50 ఏండ్లుగా
కాంగ్రెస్ పార్టీ స్కాముల్లో కూరుకుపోయిందన్నది తెలియదా అని ప్రశ్నించారు. ఆకాశం నుంచి భూమి వరకు ఉన్న అన్ని వనరులను మింగేసి అవినీతిలో కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయిందన్నారు. ఎఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని, ఆల్ ఇండియా క్రైసెస్ కమిటీ దెప్పొపొడిచారు.

పొత్తుల గురించి ఎవరడిగారు..

పొత్తుల గురించి మాట్లాడుతున్న రాహుల్ అసలు ఆయన్ని పొత్తు గురించి అడిగిన వారెవరని కెటిఆర్ నిలదీశారు. టిఆర్‌ఎస్ పార్టీకి ఎవరితో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎక్ నెంబర్ వన్ పార్టీగా అవల్‌దర్జాగా గెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రణాళికబద్ధంగా పరిపాలన చేయడం వల్ల నేడు తెలంగాణ ప్రగతిపథంలో ఉందన్నది కేంద్రం గణాంకాలే చెబుతున్నాయన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో రూ.లక్ష 20వేలు ఉండగా, 2022లో రూ.2 లక్షల 70వేలకు పెరిగిందన్నారు. జిఎస్‌టి రూ.5లక్షల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.11లక్షల 55 కోట్లకు పెరిగిందన్నారు. జిడిపి రెండున్నర శాతం ఉంటే ఐదు శాతానికి పెంచి దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తుందని.. ఇవి ఇటీవల పార్లమెంటులోనే ప్రకటించిన గణాంకాలన్నారు.

రైతు ఆత్మహత్యల్లో అత్యల్ప ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రం ఏదని పార్లమెంటులో రేవంత్‌రెడ్డి అడిగితే అది తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారన్నారు. 16వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని మంత్రి కెటిఆర్ విమర్శించారు. బిజెపి టిఆర్‌ఎస్‌తో సంబంధాలు కలిగిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తానన్న రాహుల్.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా నరానరాన హిందుత్వాన్ని నింపుకున్న రేవంత్‌రెడ్డికి గాంధీభవన్‌ను ఎలా అప్పగించావని నిలదీశారు. గాడ్సేలకు గాంధీభవన్‌ను అప్పగించి ఇతర పార్టీలపై నిందలు మోపడం దేనికన్నారు.

రాష్ట్రానికో డిక్లరేషన్..

కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం లేదనడానికి వరంగల్ డిక్లరేషన్ నిదర్శనమని మంత్రి కెటిఆర్ విమర్శించారు. రాష్ట్రానికొక డిక్లరేషన్ ఉంటే జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండదా అన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిక్లరేషన్ ఉంటే ఆ పార్టీకి క్లారిటి ఏముంటుందో చెప్పాలన్నారు. తెలంగాణలో డిక్లేర్ చేసిన అంశాల కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే అధికంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా అమలుచేస్తూ పల్లె, పట్టణ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్లడంవల్ల నేడు రాష్ట్రం అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధిని సాధిస్తుందన్నారు. ఎవరో ఏదో చెప్తున్నారని బెంగపడాల్సిన అవసరం లేదన్నారు.

-ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటి విస్తరణ..
రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధానిగా ఉన్న హైదరాబాదే కాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలుగా ఉన్న వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఐటిని విస్తరించినట్లు మంత్రి కెటిఆర్ చెప్పారు. వరంగల్‌కు సాప్ట్‌వేర్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు వరంగల్‌కు చెందిన రవిచందర్ అమెరికాలో సాఫ్ట్ పాత్ కంపెనీని ఏర్పాటు చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరదాబాద్‌లో ఆ కంపెనీని విస్తరించారన్నారు. ఇటీవల వరంగల్‌లో కూడా 250 మందితో ప్రైవేటు బిల్డింగ్‌ల్లో కంపెనీని నిర్వహిస్తున్నట్లు చెప్పారన్నారు. అందుకే ఈ రోజు ఆ కంపెనీ ప్రథమ వార్షికోత్సవానికి హాజరైనట్లు మంత్రి చెప్పారు. మరో సంవత్సరంలో వేయిమందితో ఈ కంపెనీని రన్ చేస్తానని రవిచందర్ హామీ ఇచ్చారన్నారు. వరంగల్ లాంటి ద్వితీయశ్రేణి పట్టణాలకు సాఫ్ట్‌పాత్ కంపెనీతోపాటు మైన్‌త్రి, టెక్ మహేంద్ర, జెన్‌టాక్, సయ్యంట్ లాంటి కంపెనీలు ఇప్పటికే వచ్చాయని, మరిన్ని కంపెనీలు కూడా రావడం వల్ల ఈ ప్రాంత ఐటి ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు సులభమవుతాయన్నారు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లనే జరిగిందన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో రాబోయే ఐదేళ్లలో 50వేల ఉద్యోగాల కల్పన జరుగుతాయన్నారు.

మామునూరు ఎయిర్‌పోర్టును విస్తరిస్తున్నాం..
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టును విస్తరిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఎయిర్‌పోర్టు పునర్నిర్మాణానికి కావాల్సిన చర్యలపై సమీక్షను నిర్వహించామన్నారు. ఈ సమీక్షలో ఎయిర్‌పోర్టు అథారిటి అధికారులతోపాటు ప్రభుత్వ సలహాదారులు రాజీవ్‌శర్మ, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం 1.8 కిలోమీటర్లు (1800 మీటర్లు) ఉందని దాన్ని 3.8 కిలోమీటర్ల రన్‌వేకు పెంచాలని సిఎం కెసిఆర్ సూచించారన్నారు. అందుకోసమే 400 ఎకరాల భూసేకరణ అవసరం ఉందని భూముల రేట్లు అధికంగా ఉన్నందున పక్కనే ప్రభుత్వ భూమి ఉన్నందున దాన్ని రైతులకు బదలాయించి ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమిని రైతుల నుంచి తీసుకోవాలని నిర్ణయించామన్నారు. సాధ్యమైనంత మేరకు బదలాయింపును పూర్తిచేసి ఎయిర్‌పోర్టు పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపిలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, మేయర్ గుండు సుధారాణి, మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, ఎంఎల్‌ఎలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, టి.రాజయ్య, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, ఎంఎల్‌సిలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టి.రవీందర్‌రావు, బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మీకు ఇష్టమైతేనే సేకరణ
ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగా భూములు తీసుకోమని, రైతులకు ఇష్టమైతేనే భూములు తీసుకుంటామని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రైతుల కల్లల్లో ఆనందం చూడడానికి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు ఇష్టంలేనిది ఏపని చేయమని ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుకు అభ్యంతరం లేకపోతేనే భూమి తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అయితే తీసుకున్న భూమిని డెవలప్‌చేసి అమ్ముకుంటే ఎక్కువ ధర వస్తుంది కదా అని ఆయన అన్నారు. ఎక్కువ శాతం అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని, డెవలప్ చేసిన భూమిని తన బిడ్డ పెళ్లి కోసమో! తన అవసరాల కోసం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్ గాని సంబంధిత అధికారులకు తెలియజేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు, మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ది చేయాలని ఎయిర్ ఇండియా వారు అడుగుతున్నారని, అయితే మామునూర్‌లో ఉదాహరణకు ఎకరం భూమి రెండు కోట్లు అనుకుంటే దీనికి రైతుల వద్ద నుంచి సేకరించిన భూమి ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని రైతులకు బద్దలాయించేలా చర్యలు చేపడతామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News