Saturday, November 16, 2024

ఇదేనా మీ భాష?

- Advertisement -
- Advertisement -

అన్ పార్లమెంటరీ పదాలపై కెటిఆర్ వ్యంగ్యాస్త్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్‌పిఎ ప్రభుత్వ పార్లమెంటరీ భాష అంటూ కెటిఆర్ వ్యం గ్యంగా ట్వీట్ చేశారు. నిరసనకారులను పిఎం ‘ఆందోళన్ జీవి’ అని పిలవడం మంచిదా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ‘80-20’ ఓకేనా అని అడిగారు. మహాత్మాగాంధీని బిజెపి ఎంపి కించపరిచిన తీ రు బాగానే ఉందా.. ‘షూట్ సాలోంకో’ అని ఓ మంత్రి చెప్పడం సరైందేనా అని కెటిఆర్ నిలదీశారు. రైతు నిరసనకారులను ఉగ్రవాదులని అవమానించారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ సరైనవేనా అని ట్విట్టర్ వేదికగా మోడీని కెటిఆర్ ప్రశ్నించారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ సెక్రటేరియట్ ఇటీవల ‘అన్ పార్లమెంటరీ’ పదాలు వి వరిస్తూ ఓ బుక్‌లెట్ విడుదల చేసింది.

తాజాగా చేర్చిన పదాలలో జుమ్లా జీవి, కరోనా వ్యాప్తి, జైచంద్, శకుని, లాలీపాప్, చందల్ క్వార్జెట్, గుల్ ఖిలాయే, పిట్టు, అరాచకవాది, వినాశ్‌పురుష్, ఖలిస్థానీ, చీటర్, నికమ్మా, బెహ్రీ సర్కా ర్, కాలా బజారీ, దలాల్, దాదాగిరి, బే చారా, బాబ్‌కట్, విశ్వాస్‌ఘాత్, సంవేదనహీన్, బ్లడ్‌షెడ్, డాంకీ వంటివి ఈ అంశం రాజకీయ దుమారమే రేపుతోంది. వాక్‌స్వాతంత్య్ర హరించే విధంగా ఈ నిర్ణయాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే మాటల యుద్ధాన్ని ఆపేం దుకు మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. పార్లమెంటులో నిషేధించబడిన పదాల జాబితాను వివరించే కోల్లేజ్‌ను కూడా మంత్రి పంచుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News