Friday, December 20, 2024

అమెరికా పర్యటనకు బయలుదేరిన మంత్రి కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

Minister KTR Flies to US Tour for a week

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి మంత్రి కెటిఆర్ బృందం అమెరికా బయలుదేరింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ డియాగో, సానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి అనేక కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందాలతో మంత్రి కెటిఆర్ సమావేశం కానున్నారు. వారం రోజులకు పైగా కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్ ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Minister KTR Flies to US Tour for a week

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News