Monday, December 23, 2024

రేపు మహబూబ్‌నగర్ జిల్లాకు మంత్రి కేటీఆర్

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల: తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తోంది. జడ్చర్ల పట్టణంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ లబ్ధిదారులకు ఇండ్లపట్టాలు పంపిణీ చేయనున్నట్లుమాజీ మంత్రి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News