Saturday, January 18, 2025

అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సిఆర్‌పిఎఫ్ పరీక్షలు 13 భాషల్లో రాసే వెసులుబాటు కల్పించడంపై కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది ఉద్యోగార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఇటీవల కేంద్రం సిఆర్‌పిఎఫ్‌లో 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మన్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే, నియామక పరీక్ష ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై పలు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. హిందీలో రాసే వెసులుబాటు ఉండడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల వారికి లబ్ది చేకూరుతుందని, దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు నష్టపోతారని పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కెటిఆర్ కూడా దీనిపై ట్వీట్ చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో, కేంద్రం సిఆర్‌పిఎఫ్ నోటిఫికేషన్‌ను సవరించింది. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News