Monday, November 25, 2024

వ్యాధి బాధిత బాలికకు మంత్రి కెటిఆర్ సాయం

- Advertisement -
- Advertisement -
Minister KTR help to a girl suffering from disease
ఎంఎల్‌ఎ సురేందర్ ఆధ్వర్యంలో ఎంఎల్‌సి కవిత చేతుల మీదుగా రూ.10లక్షల చెక్కు అందజేత

మనతెలంగాణ/సదాశివనగర్ : ఆపదలో ఉన్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కంచర్ల సురేందర్ గౌడ్ కూతురు లిఖిత 16 గత కొన్ని రోజులుగా క్లైవల్ కార్డోమా అనే వ్యాధితో బాధపడుతుంది. ఆర్థిక సమస్యల్లో ఉన్న కుటుంబం ఆమెకు చికిత్స చేయించలేకపోవడంతో గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను సంప్రదించారు. పరిస్థితిని వివరించగా ఆయన ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఐటి,పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి అమ్మాయికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం నుంచి10 లక్షల రూపాయల ను మంజూరు చేసారు. ఎమ్మెల్యే సురెందర్ ఆద్వర్యంలో గురువారం నిజామాబాద్‌లో కవిత చేతుల మీదుగా అఖిల కుటుంబ సభ్యులు చెక్కును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షుడు బొలిపల్లి మహెందర్ రెడ్డి, సొసైటి చైర్మన్ మర్రి సదాశివరెడ్డి, మాజి జడ్‌పిటిసీ రాజేశ్వర్ రావు, మండల సీనియర్ నాయకులు గైని రమేష్, పైడి జనార్దన్, సంకరి లింగం, ఎడ్ల నర్సింలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News