ఎంబిబిఎస్, బిటెక్ చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థినులకు మంత్రి కెటిఆర్ అండదండలు
కోర్సులు పూర్తయ్యేవరకు
ఆర్థిక సాయం ట్విట్టర్
ద్వారా వారి స్థితిగతులు
తెలుసుకొని ప్రగతిభవన్‌కు
రప్పించి ఫీజుల చెక్కులు
అందజేత ఆనందంతో
ఉప్పొంగిపోయిన
విద్యార్థినులు పేదలను
చదివించడానికి మరోసారి
ముందుకొచ్చిన మంత్రి
కెటిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మరోసారి తన ఔదారాన్ని చాటుకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల తో సతమతమవుతున్న పేద పేద విద్యార్థినులకు సాయం చేయడా నికి ముందుకొచ్చారు. కోర్సులకు పూర్తయ్యే ఖర్చును అందజేస్తామని హామీ ఇచ్చారు. జయశంకర్ భూ పాలపల్లి జిల్లాకు చెందిన కావేరి, శ్రావణిలు పేద విద్యార్థులు. వారి ద్దరు మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సు లు చదువుతున్నారు. ఫీజు చెల్లించ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్ట ర్ ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వారికి ప్ర గతి భవన్‌కు పిలిపించుకొని ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇచ్చా రు. కాగా, వారిద్దరూ టిఎస్‌డబ్లూ ఆర్ ఇఐఎస్, టిఎస్ స్కూ ల్లో విద్యనభ్యసించారు. కావేరి 95శాతంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ కోర్సులో చేరగా, శ్రావణి 97శాతం మార్కుల తో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఆం ధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటిలో బిటెక్ (ఇసిఇ)లో ప్రవే శం పొందారు.
మెరిట్ ఆధారంగా వారు ఉచితంగా సీట్లు పొంది నప్పటికీ మెస్ ఫీజుతో పా టు ఇతర ఫీజులను చెల్లించలేక ఇ బ్బందులు ఈ విష యం తెలుసుకున్న కెటిఆర్ వారికి అండగా నిలవాలని నిర్ణయించుకు న్నారు. వారి కోర్సులు పూర్తయ్యే వరకు కావాల్సిన ఆర్థికసాయం అందజేస్తామని కెటిఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. బాలికల యోగక్షేమాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫీజులకు సంబంధించిన చెక్కులను సైతం వారికి మంత్రి కెటిఆర్ అందజేశారు. కాగా తమను ఆదుకునేందుకు స్వయంగా కెటిఆర్ ముందుకు రావడంతో వారు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. తమలాంటి పేదలను చదవించడానికి కెటిఆర్ ముందుకు వచ్చి…. మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారన్నారు. ఇందుకు కెటిఆర్‌కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.