Wednesday, January 22, 2025

తయారీ రంగానికి హైదరాబాద్ అడ్డా

- Advertisement -
- Advertisement -

యువతకు ఉపాధి, రాష్ట్ర రాబడిని పెంచే సంస్థలకు ప్రోత్సాహం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ-హబ్, టీ-సెల్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి
ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడిదారుల పట్ల ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు ఒకేఒక్క గమ్యస్థానం హైదరాబాద్ అని, ఇకపై దేశంలోని ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. హైటెక్ సిటీ హుడా టెక్నో ఎన్‌క్లైవ్‌లో జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి కెటిఆర్ శని వారం ప్రారంభించారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవ కాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామన్నారు. స్థానికంగా పెట్టుబడులు, తయారీ యూనిట్లు పెట్టే వారి కోసం ఇప్పటికే వివిధ పాలసీలు తీసుకొచ్చా మన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ భారత్‌లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు. వ్యాపార విస్తరణ చేయడంతో పాటు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు జాన్సన్ కంట్రోల్ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

టి హబ్, టి -సెల్‌లు హైదరాబాద్‌లో….

జాన్సన్ కంట్రోల్ సంస్థ దశాబ్ధ కాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తుందని, హైదరాబాద్ ఎంతలా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టి హబ్, టి -సెల్ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. ఇమేజ్ టవర్స్, ప్రపంచ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారబోతుందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఇక్కడ అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌కు తరలివస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్ సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా మారిపోయిందని ఆయన తెలిపారు. ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఇంట్రూజన్, యాక్సెస్ కంట్రోల్, వీడియో సర్వైలెన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయనుందని ఆయన వివరించారు. ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా సుమారుగా 500ల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News