ఎల్‌బి నగర్ నుంచి ఆరాంఘర్ వరకు అడ్డంకులు లేని ప్రయాణం
పైవంతెనను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, సబిత
హైదరాబాద్ : ఎల్‌బి నగర్ నుంచి ఆరాం ఘర్ వరకు అడ్డుకులు లేని ప్రయాణానికి అనువుగా మరో ప్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మిథాని, ఓవైసీ జంక్షన్ల మధ్య నిర్మించిన మల్టీ లేవల్ ప్లైఓవర్‌ను మంగళవారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. రూ.80కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లైఓవర్‌ను మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సయ్యద్ అమినుల్ హాసన్ జాఫ్రీ, అమినుల్ హాసన్ ఆఫ్రీది, బొగ్గారపు దయానంద్ గుప్తా, యెగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేట్లరు మిర్జా ముస్తాఫా బేగ్, వంగా మధుసూదన్ రెడ్డి, రేష్మా ఫాతిమా, మహమ్మద్ ముజఫర్ హూస్సెన్ తదితరులు పాల్గొన్నారు.
2018లోశ్రీకారం 2021లో ప్రారంభం
నగరంలోని ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరించి తద్వారా సిగ్నల్ రహిత నగర రహదారులుగా తీర్చిదిద్దడమే లక్షంగా పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ దీశ నిర్దేశనంతో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా 2018 ఏఫ్రిల్‌లో రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లైఓవర్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2021 డిసెంబర్ మొదటి వారానికి పూరైంది. రూ.90 కోట్లలో ప్లై ఓవర్ నిర్మాణానికి రూ.63 కోట్లు, భూసేకరణకు రూ.9 కోట్లు, జలమండలి పైపులైన్ మార్పుకు రూ.5 కోట్లు, విద్యుత్ తీగల మార్పుకు మరో రూ.3 కోట్లు ఖర్చు చేశారు. అత్యుధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫ్రీ క్యాస్ట్ విధానంలో ఈ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి ప్లైఓవర్. ఈ ప్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఓల్ట్‌సిటీవాసులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, వివిధ రక్షణ రంగ సంస్థలకు వెళ్లే ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఎంతో ఉపశమపనం లభించినట్లైంది.
ఎపిజె అబ్దుల్ కలాం ప్లైఓవర్‌గా నామకరణం
మిథాని, ఓవైసీ జంక్షన్ల ప్లైఓవర్‌కు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం ప్లై ఓవర్‌గా నామకరణం చేశారు. ట్విటర్ వేదికగా ఈ ప్లైఓవర్‌కు అబ్దుల్ కలాం పేరును మంత్రి కెటిఆర్ ప్రకటించారు. కంచాన్‌బాగ్‌లో ఉన్న డిఆర్‌డిఓలో అబ్దుల్ కలాం సుదీర్ఘ కాలం పనిచేయడం, ఈ ప్రాంతంతో ఆయనకు దశాబ్దాల కాలం అనుబంధం ఉండడంతో ఆయన జ్ఞాపకార్ధం ఈ ప్లైఓవర్‌కు అబ్దుల్ కలాం పేరును పెట్టినట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.