హైదరాబాద్ : ఒక్క హైదరాబాద్‌కే ఐటిని పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటి టవర్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటి టవర్‌ను శనివారం మంత్రి కెటిఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. దివిటిపల్లిలో నాలుగు ఎకరాల్లో ఐదు అంతస్తుల్లో రూ.40 కోట్ల వ్యయంతో ఈ ఐటి టవర్‌ను నిర్మించారు. ఇప్పటికే ఈ ఐటి టవర్‌లో పలు కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఐటి టవర్‌ను ప్రారంభించడంతో ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఐటి టవర్ నిర్మాణానికి 2018, జులై నెలలో మంత్రి కెటిఆర్ శంకుస్థాపన కావించిన సంగతి విదితమే.
దివిటిపల్లిలో ఐటి టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -