హైదరాబాద్: జవహర్ నగర్ లో లీచెట్ శుద్ధి ప్లాంట్ ను మంత్రి మల్లా రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి
మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. రూ.250 కోట్ల తో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ డంప్ యార్డు నుంచి వచ్చే కలుషిత వ్యర్ధ జలాలను శుద్ధి చేయనుంది. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాంకీ సంస్థ నిర్వాహకులు కేటీఆర్ కి వివరించారు.
Also read: బిఎస్6 ఫేజ్ 2.. మే నుంచి పెరగనున్న టాటా కార్ల ధరలు
వచ్చే నెల మే 31లోపు 30 ఎకరాల్లో విస్తరించిన మల్కారం చెరువు లిచేట్ ను ట్రీట్ మెంట్ పూర్తి చేస్తామని వివరించారు. వచ్చే నెల ఏప్రిల్ నాటికి పూర్తిగా లిచేట్ శుద్ధి చేస్తామని తెలిపారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవం లోపు మల్కారం చెరువు ని శుద్ధి చేయాలని అప్పుడు మళ్ళీ వచ్చి చూస్తానని, మొత్తం డంపింగ్ యార్డ్ లో లిచేట్ ట్రీట్ మెంట్ వచ్చే ఏడాది లోపు చేస్తామని కేటీఆర్ కి చెప్పారు. అంతలోపు పనులు ఎలా జరుగుతున్నాయో చూసేందుకు మరోసారి వస్తానని కేటీఆర్ అన్నారు.