Sunday, January 19, 2025

మైక్రో చిప్ డవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారవు అన్నారు. కోకాపేటలో ఆయన మైక్రో చిప్ టెక్నాలజి అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాస్కామ్ ప్రకారం గత రెండేళ్ళలో టెక్నాలజి రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే సృష్టించినట్లు ఆయన చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం నుంచి సహయ సహకారాలు లభిస్తాయన్నారు. లైఫ్ సైన్స్ రంగంలో నగరం గణనీయమైన అభివృద్థి సాధించిందని, దేశానికే లైఫ్ సెన్సెస్ రాజధానిగా నగరం ఉందన్నారు. ప్రంచంలో అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉన్నట్లు వెల్లడించారు. సెమి కండక్టర్ రంగంలో భారత్ తన వర్క్ ఫోర్స్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెమీ కండక్టర్ రంగంలో భారత్ ఇప్పడిప్పుడే అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు.

వచ్చే దశాబ్దంలో ఈ రంగంలో భారత్ ముందుకు దూసుకెళ్తుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆ ప్రక్రియలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మందికి స్వంత ఖర్చులతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ స్కిలింగ్‌లో రంగంలో కూడా అగ్రగామిగా కొనసొగుతుందన్నారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చాండ్లర్ మైక్రో చిప్ టెక్నాలజి కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. స్మార్ట్,కనెక్టెడ్, సెక్యూర్ ఎంబెడ్ కంట్రోల్ సొల్యూషన్స్ ఆ కంపెనీ కల్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్, ఎరోస్సేప్ ,డిఫెన్స్, కంప్యూటింగ్ మార్కెట్లకు చెందిన లక్షా 25వేల మంది కస్టమర్లు ఆ కంపెనీ సేవల్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో మైక్రోచిప్ అధినేతలకు మంత్రి కెటిర్ అభినందనలు తెలిపారు. మైక్రోచిప్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్త మద్దతు ఇస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

దేశంలో దాదాపు 25సంవత్సరాలు విజయవంతంగాకార్యకలాపాలను నిర్వహించిన అనుభవం తోఈ కొత్త సదుపాయం రాబోయే సంవత్సరాల్లో మైక్రోచిప్ వృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి మాకు తోడ్పడుతుంది ‘ అని మైక్రోచిప్ ప్రెసిడెంట్ ,సిఇఒ గణేష్ మూర్తి అన్నారు. ఈ సెంటర్ భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార కారిడార్‌లలో ఉండటం తో , గ్లోబల్ మైక్రోచిప్ వ్యాపార అవసరాలకు, ఈ ప్రాంతంలో పెరుగుతున్న మా కస్టమర్ బేస్‌కు మద్దతుగా హెడ్‌కౌంట్‌ను గణనీయంగా విస్తరించడానికి దోహద పడుతుందన్నారు. మైక్రోచిప్15-అంతస్తుల వన్ గోల్డెన్ మైల్ ఆఫీస్ టవర్‌లో168,000చదరపు అడుగుల రీసెర్జ్ అండ్ డవలప్‌మెంట్ సెంటర్ కోసం ఐదు అంతస్తులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మైక్రోచి కొత్త డెవలప్‌మెంట్ సెంటర్ బెంగుళూరు,చెన్నై,హైదరాబాద్,పూణె మరియు న్యూ ఢిల్లీలోని సేల్స్ ఆఫీసులతో పాటు బెంగుళూరు చెన్నైలోని మరో రెండు డెవలప్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.ప్రతిభావంతులైన వర్కుఫోర్స్ ను పెంపొందించటం, అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతీయ సెమీకండక్టర్ హబ్‌లో తన కార్యకలాపాలు పెంచుకునే లక్ష్యంతో సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి ,పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.

KTR2

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News