Sunday, December 22, 2024

విమర్శలు చేయడం సులభం.. పనులు చేయడమే కష్టం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR inaugurates 2BHK houses in Sircilla District

వెంకటాపూర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెంకటాపూర్ లో మంత్రి కెటిఆర్ శనివారం డబుల్ బెడ్ రూంలను ప్రారంభించారు. విమర్శలు చేయడం సులభం.. పనులు చేయడమే కష్టమని కెటిఆర్ అన్నారు. కోట్లాది అభివృద్ధి పనులు జరుగుతున్న విమర్శకులకు కనిపించట్లేదని ప్రశ్నించారు. కోతల్లేని విద్యుత్ ఉందని ఏ రైతును పలకరించినా చెబుతారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వెంకటాపూర్ అభివృద్ధి బాటలో ముందుకెళ్లోందని ఆయన తెలిపారు. అర్హులైన అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో గూడు లేని పేదలు ఉండకూడదని చెప్పారు. అడిగే అవసరం లేకుండా ప్రజలకు అన్నీ ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం అని మంత్రి స్పష్టం చేశారు. పైరవీలు లేకుండానే ప్రజలకు పథకాలు అందుతున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా ఈ తరహా రెండు పడకల ఇళ్లు కట్టలేదన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి అభివృద్ధి ఉందా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News