హైదరాబాద్: అత్యాథునిక సౌకర్యాలతో మరో వైకుంఠదామం నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. రూ. 4 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో మహాప్రస్థానానికి దీటుగా ఫోనిక్స్ సంస్థతో కలిసి జిహెచ్‌ఎంసి అభివృద్ది చేసిన పంజా గుట్ట వైకుంఠ మహాప్రస్థానాన్ని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఫోనిక్స్ సంస్థ సహాకారంతో అత్యాధునిక ధహన వాటికలను నిర్మించారు.
అదేవిధంగా దహన సంస్కరణల అనంతరం ఎముకలు, బుడిదను భద్రపర్చేందుకు ప్రత్యేక గదులను నిర్మించారు. అదేవిధంగా ప్రత్యేక స్నానాల గదుల నిర్మాణంతో పాటు సకల సౌకర్యాలను కల్పించారు. పరిసర ప్రాంతాలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జిహెచ్‌ఎంపిసి కమిషనరేట్ రోనాల్డ్ రో స్, కార్పొరేటర్ కవిత రెడ్డీఅధికారులు తదితరులు పాల్గొన్నారు.