హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వార్డు కార్యాలయాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వార్డు కార్యాలయాలు ప్రారంభించారు. 150 డివిజన్లలో అధికారులు వార్డు కార్యాలయాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉండనున్నారు. పారిశుధ్యం, విద్యుత్, టౌన్ ప్లానింగ్ వంటి వాటిపై ఫిర్యాదులు చేయవచ్చు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం సంతోషకరమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వికేంద్రీకరణ, ప్రజల కేంద్రంగా పాలనే మా లక్ష్యమన్నారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదుల పరిష్కారం కానున్నాయని, సిటిజన్ చార్టర్ కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందనున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రతి డివిజన్ కార్యలయంలో 10 మంది అధికారుల బృందం అందుబాటులో ఉంటుందన్నారు. సహాయక పుర కమిషనర్ నేతృత్వంలో సమస్యల పరిష్కారం అవుతాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.