Thursday, September 19, 2024

అక్కున చేర్చుకుంటూ.. ఆత్మ స్థైర్యాన్నిస్తూ

- Advertisement -
- Advertisement -

వరద ముంపు బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా కెటిఆర్ పర్యటన
బాధితుల సమస్యలను ఓపికగా వింటూ అక్కడిక్కక్కడే పరిష్కారం
సికింద్రాబాద్, ఉప్పల్ నియోజక వర్గాల కాలనీ ప్రజలకు రూ. 10వేల ఆర్థిక సాయం
శిబిరాల సందర్శన, బాదితులకు అందుతున్న సాయంపై ఆరా
ఉప్పల్ నల్లచెరువు మరమ్మతుల పరిశీలన, అధికారులకు కీలక సూచనలు
మరిన్ని బృందాలతో సహాయక చర్యల వేగవంతానికి ఆదేశం

Minister KTR Inspects Rain Affected Areas in Hyd

మన తెలంగాణ/హైదరాబాద్: వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పర్యటనలు ఉధృతంగా సాగుతున్నాయి. వెళ్లిన ప్రతిచోట ఆయన బాధితులతో ముచ్చటిస్తున్నారు. వారి కష్ట, నష్టాలను ఓపికగా వింటున్నారు. ఆయా సమస్యల పరిష్కానికి మంత్రి కెటిఆర్ అక్కడికక్కడే అగమేఘాలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఆ యన రాకతో బాధితుల్లో భరోసా పెరుగుతోం ది. సహాయక చర్యలు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం క ల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీస్తునే, మరోవైపు ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగదంటూ మంత్రి కెటిఆర్ వారిలో విశ్వాసాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం బాధితలకు అందిస్తున్న ఆర్ధి క సహాయం వీలైతే మరించ పెంచడానికి కూ డా సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడినా ఫరవాలేదు కానీ బాధితుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించం…ఎవరి నిర్లక్షం చేయమని మంత్రి కెటిఆర్ పేర్కొంటున్నారు. ఇలా యువనేత తన పర్యటనను ఆసాంతం బాధితులకు అండగా, వారికి ఒక ఆత్మీయుడి అనే భావన కల్పిస్తున్నారు. దీని కారణంగా వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలంతా మంత్రి కెటిఆర్ రాక కోసం….ఆయన నుంచి వచ్చే భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా మంత్రి కెటిఆర్ బుధవారం సికింద్రాబాద్ నియోజక వర్గంలోని లాలాపేట్‌తో పాటు బోడుప్పల్, అంబర్‌పేట్, నల్లకుంట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి ప్రజల యొక్క పరిస్థితులను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అందిస్తున్న తక్షణ ఆర్థిక సాయం కింద రూ.10వేలను పలు కుటుంబాలకు అందించారు. ఇది కేవలం తక్షణ సహాయం మాత్రమేనని అన్నారు. వరద తీవ్రతకు పాక్షికంగా లేదా పూర్తిగా ఇళ్లు నష్టపోయిన వారికి మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కెటిఆక్ తెలిపారు. ప్రకృతి సృష్టించిన ఈ కష్టం కాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ముందుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట్‌కు వచ్చిన మంత్రి కెటిఆర్ అక్కడ వరదకు నష్టపోయిన పలు కుటుంబాలను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న గుడిసెలను, అందులో నివసిస్తున్న కుటుంబాలను ఆయన పలకరించారు. వారికి తక్షణ సహాయంగా రూ.10వేలు అందించారు. ఆ తర్వాత బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన షెల్టర్ సెంటర్‌లను ఆయన పరిశీలించారు. వారికి అందుతున్న ఆహార, వైద్య సదుపాయాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ తరఫున అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్యాంపును ఆయన సందర్శించారు. క్యాంపుతోపాటు అందులోకి రాలేని అనేక మందికి ప్రత్యేకంగా భోజనశాల ఏర్పాటు చేసి వారి దగ్గరికే వెళ్ళి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని అధికారులు మంత్రి కెటిఆర్‌కు వివరించారు.
ఆ తర్వాత ఉప్పల్ నల్ల చెరువు వద్ధ వరద ఉధృతికి దెబ్బతిన్న చెరువు అలుగు మరమ్మతు పనులను పరిశీలించారు. చెరువుకు సంబంధించిన మరమ్మతులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు పక్కనే ఉన్న రామంతపూర్ లోని నేతాజీనగర్‌లో పర్యటించారు. తదనంతరం అంబర్‌పేట్ నియోజకవర్గంలోని నల్లకుంట వద్ద ఉన్న రత్ననగర్ కాలనీలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న తక్షణ ఆర్థిక సహాయాన్ని ఈ సందర్భంగా పలువురు బాధితులకు అందించారు. అలాగే అక్కడ ఉన్న నల్లకుంట నాలాను మంత్రి పరిశీలించి, వరద సాఫీగా వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ సహాయాన్ని వరద బాధితులకు అందించేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
వర్షాలు కొంచం తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతున్నాయని ఆయన తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయాన్ని ఇంటి వద్దకే వెళ్లి అందజేసే ప్రభుత్వ బృందాల సంఖ్యను కూడా పెంచినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ తక్షణ ఆర్థిక సహాయాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మంత్రి కెటిఆర్ పర్యటనలో మంత్రి మల్లారెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అంబర్‌పేట్, ఉప్పల్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్, బేతి సుభాష్ రెడ్డిలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.

Minister KTR Inspects Rain Affected Areas in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News