Thursday, January 23, 2025

ఐటి యువతి ర్యాప్ సాంగ్‌కు ఫిదా అయినా మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కెటిఆర్ రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటారు. తాజాగా మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ యువతి తనను ఆపి మరి హైదరాబాద్‌ను ఉద్దేశించి పాడిన క్రేజీ ర్యాప్ సాంగ్‌ను ట్వీట్ చేశారు. ఆ ర్యాప్ సాంగ్‌ను వింటున్న సమయంలో మంత్రి కెటిఆర్ చాలా ఎంజాయ్ చేశారు. ఆ సింగర్‌ని కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఆ యువతి పాటకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ ‘ఏంట్ దట్ స్వీట్ థ్యాంక్స్ @MirchiRJswathi’అని ఆ పాటకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.

అర్పిత అనే యువతి పాడిన ర్యాప్ సాంగ్‌లో..‘ హైదరాబాద్ అంటేనే హైపర్‌గా ఉంటాం.. బిర్యానీ తింటూనే ఇరానీ ఛాయ్ అంటాం.. మండే టు ఫ్రైడే ఆఫీసులకు వెళ్లి పోతాం.. మెట్రో ఎక్కి దిగేదాగా ముచ్చట్లే పెడుతాం.. ఐటీ మాదే.. ఫార్మా మాదే.. అంబేడ్కర్ విగ్రహానికి సెల్యూట్‌నే కొడతాం.. ఐటిలో అయినా .. అభివృద్ధిలో అయినా.. టాప్ మనమే.. ఫస్ట్ మనమే.. బెస్ట మనమే.. అన్నింట్లో అవార్డుల్లో మస్త్ మనమే.. బోనాల పండుగకు పునకాలు తెస్తా.. దసరా ముంగిటా బతుకమ్మ ఆడుతాం.. మనది హైద్రాబాదు.. దేశంలో మనమే జోరు.. మన కేటిఆర్.. ఇగ సూడర జోరు .. అంటూ పాడిన పాటకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఏదిఏమైనా ఈ ర్యాప్‌కు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News