Thursday, January 9, 2025

మంత్రి కేటీఆర్ యువతకు స్పూర్తి ప్రధాత

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యువతకు స్పూర్తి ప్రధాత అని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి ఒక దిక్సూచి, యువకులకు మార్గదర్శిగా అన్నారు. ఆయన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లుతున్నాడని పేర్కొన్నారు. ఆయన పుట్టిన రోజున భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదంచాలని ఆ దేవున్ని వేడుకుంటున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ దాసరి మమత, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల సురేందర్, పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ నజ్మీన్‌సుల్తానా, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, మార్కెట్ డైరెక్టర్‌లు, కోఆప్షన్‌లు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News