కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు యువ నాయకులు ఐటీ, పురపాలక, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు జన్మదిన వేడుకలను కరీంనగర్ నగరంలో పార్టీ శ్రేణులమంతా కలిసి పండగలా ఆనందంతో జరుపుకున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.
సోమవారం నిర్వహించిన వేడుకలలో మేయర్ పాల్గొని మాట్లాడుతూ పురపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు కు కరీంనగర్ నగర ప్రజలు, పార్టీ శ్రేణుల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆశాకిరణం మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పండగలా జరుపుకున్నట్లు తెలిపారు. కేటీఆర్ పిలుపు నిచ్చిన గిఫ్టే స్త్మ్రల్ కార్యక్రమం ద్వారా నగరంలో చాలా మంది పేద ప్రజలకు సామాజిక కార్యక్రమాలు చేశామని తెలిపారు. విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగం వదలుకొని ప్రత్యేక తెలంగాణ ద్యేయంగా స్వరాష్ట్రం కోసం ఆనాడు ఉద్యమం చేశారని తెలిపారు.
ఘనంగామంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు :
జ్యోతిబాపూలే పార్కులో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 60 వ డివిజన్ కార్పోరేటర్ వాల రమణరావు ఆద్వర్యంలో మేయర్ యాదగిరి సునీల్ రావు వాకర్స్ తో కలిసి కేక్ కట్ చేసి అల్పహార వితరణ చేశారు. అనంతరం గిఫ్టే స్త్మ్రల్ లో భాగంగా నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మీకులకు చీరలు పంపిణీ చేశారు. మరో వైపు నగరంలోని 33 వ డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయం వద్ద మేయర్ యాదగిరి సునీల్ రావు పలువురు కార్పోరేటర్లు, పార్టీ శ్రేణులు, క్యాంపు సిబ్బంది తో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపిస్తూ… సంబరాలు చేశారు.
మరో వైపు స్థానిక తెలంగాణ చౌక్ వద్ద బిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో 48 కేజీల భారీ కేక్ కటింగ్‌లో పాల్గొని, పార్టీ కార్యకర్తలు, స్థానికులకు పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు దూలం సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయంలో కేటీఆర్ పేరిట ప్రత్యేక అర్చణ అభిషేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం స్థానికులకు అల్పాహార వితరణ చేశారు. నగరంలోని జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ ఆద్వర్యంలో గిఫ్టే స్త్మ్రల్ కార్యక్రమంలో భాగంగా గంథాలయంకు వచ్చే 200 మంది పాఠకులకు ఉచిత ఎంట్రి సభ్యత్వ నమోదు చేయించి కేటీఆర్ రాజకీయ ప్రస్తాన పుస్తకాన్ని ఆవిష్కరించారు. బిఆర్‌ఎస్ యూత్ విభాగం నాయకులు కుల్దీప్ సింగ్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో గిఫ్ట్ ఎ స్త్మ్రల్ లో భాగంగా పలువురికి స్టీల్ సద్దిగిన్నెలు ( టిఫిన్ బాక్స్) పంపిణీ చేశారు.
11 డివిజన్ లోని కట్టరాంపూర్ ప్రాంతంలో కార్పోరేటర్ ఆకుల నర్మద నర్సయ్య, బీఆర్‌ఎస్ నాయకులు డీ. సంతోష్ ఆద్వర్యంలో కేక్ కట్ చేసి గిఫ్టే స్త్మ్రల్ లో భాగంగా రుధ్రాక్ష మాలలు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ మహిళ విభాగం నాయకురాలు గందె కల్పన ఆద్వర్యంలో మాత శిషు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌లో డెలివరీ పేషెంట్స్ (బాలింతలకు)కు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. మరో వైపు 7 వ డివిజన్ పరిదిలోని హౌజింగ్ బోర్డు కాలనీలో కార్పోరేటర్ ఆకుల పద్మ ప్రకాష్ ఆద్వర్యంలో వీర బ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం చేశారు.
బిఆర్‌ఎస్ మైనార్టీ విభాగం నాయకులు సయ్యద్ నయీమ్ ఆధ్వర్యంలో పాతబజార్ కరీముల్లా షా దర్గాలో కేటీఆర్ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం 33 వ డివిజన్ భగత్ నగర్ అయ్యప్ప దేవాలయం వద్ద మేయర్ యాదగిరి సునీల్ రావు డివిజన్ పేద ప్రజలకు వర్షకాలం సంధర్బంగా గిఫ్టే స్త్మ్రల్ కార్యక్రమంలో టార్పాలిన్ కవర్లను పంపిణీ చేశారు.