Saturday, November 23, 2024

షర్మిలా తెల్సుకో.. ఇదే మా కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ గడపగడపలో ఎగజిమ్ముతున్న మిషన్ భగీరథ నల్లాను అడిగితే కెటిఆర్ ఎవరో చెపుతుంది. ఆడబిడ్డల నీటి కష్టం తీర్చడానికి మిషన్ భగీరథను ముందుండి నడిపిన మార్గదర్శి కెటిఆర్. తెలంగాణ పెద్ద పండుగ కోసం ఆడబిడ్డలకు ప్రభుత్వం పంపుతున్న సారెను అడిగితే కెటిఆర్ ఎవరో చెపుతుంది. అటు నేతన్నల కడుపు నింపడంతో పాటు ఇటు ఆడపడుచుల పండుగ సంతోషంగా మారారు కెటిఆర్. మహిళా సాధికారికత కోసం పుట్టిన వీహబ్ ను అడిగితే కెటిఆర్ ఎవరో చెపుతుంది. వినూత్న ఆలోచనలతో భవిష్యత్‌ను మార్చాలనుకుంటున్న ఎందరో యువకుల కలల సాకారంగా వెలసిన టిహబ్ ను అడిగితే కెటిఆర్ ఎవరో చెపుతుంది. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఆపదలో ఉన్న ఎందరికో అందిన సాయాన్ని అడిగితే చెపుతుంది కెటిఆర్ అంటే ఎవరో.. కరోనా కష్టకాలంలో ఊపిరి ఆడని ఎందరికో అందిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అడిగితే చెపుతాయి కెటిఆర్ అంటే ఏంటో? ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా, ఒక కొడుకుగా, పాలకుడిగా ఈ పనులన్నింటినీ బాధ్యతతోనే కెటిఆర్ చేశారు గాని, మీరు అన్నట్టు పెద్ద మొగోడు అనుకుని మాత్రం చెయ్యలేదు.

తాత ఫ్యాక్షనిస్టు. తండ్రేమో నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి. ఇక అన్న అయితే అందినకాడికి దోచుకుని జైల్లో చిప్పకూడు తిన్నోడు. అలాంటి కుటుంబంలో పుట్టి, పెరిగిన శ్రీమతి షర్మిలగారికి తెలంగాణ గడ్డ తయారుచేసుకున్న ఉద్యమకారుడు కల్వకుంట్ల తారకరామారావు తెలియదు అనడం అమాయకత్వం కాదు. వలసవాద అహంకారం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఎన్నడూ గుర్తించని ఆంధ్రా దురహంకార ధోరణికి కొనసాగింపుగానే శ్రీమతి షర్మిలగారి వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి. తెలంగాణను అరిగోస పెట్టిన సమైక్యపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఇవాళ స్వరాష్ట్రంలో తెలంగాణ జాతి సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కే.టీ.ఆర్ ఎవరో క్లుప్తంగా చెప్పాలంటే కొంచెం కష్టమే. కాని శ్రీమతి షర్మిల గారి కండ్లకు కమ్ముకున్న పొరల్నీ కాస్తైనా తెరిపించేందుకు, ఆమెకు లేని సోయి రప్పించేందుకు చిన్న ప్రయత్నం చేస్తాను.

తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్ష కోసం మలిదశ ఉద్యమానికి కే.చంద్రశేఖరరావు గారు ఊపిరి పోస్తున్న సందర్భంలో… ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని సాధారణ కార్యకర్తలా తెలంగాణ జెండా ఎత్తిపట్టుకున్నారు కేటీఆర్. తండ్రి పేరు చెప్పి కాయలు అమ్ముకునే శ్రీమతి షర్మిల గారిలా కాకుండా ఉద్యమ సిద్ధాంతకర్తలైన జయశంకర్ సార్, విద్యాసాగర్ వంటి మేధావులతో జ్ఞానప్రాసన చేయించుకుని, ఈ గడ్డ కష్టనష్టాలను ఒంటబట్టించుకున్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని ఉద్యమరథసారథి జంగ్ సైరన్ జమాయించినప్పుడు, కొడుకుగా అడ్డుపడకుండా, తెలంగాణ తల్లి బిడ్డగా ఉద్యమ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక నిరాహార దీక్షతో ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణించిన సమయంలో గుండెలోపలున్న బాధని ఎవరికీ కనిపించనియ్యకుండా, కట్టలు తెగిన ఓయూ విద్యార్థుల కోపాన్ని, ఆవేశాన్ని కేటీఆర్ హ్యాండిల్ చేసిన తీరును ఎవరైనా ఎలా మరిచిపోతారు. దశాబ్దం పాటు ఎండనక, వాననక ఉద్యమమే ఊపిరిగా ప్రజలతో మమేకమై ఈ గడ్డ ఆకాంక్షలు, ఆశలకు ప్రతిరూపమయ్యారు కేటీఆర్.

తెలంగాణ వారికి పరిపాలన చేతకాదని సీమాంధ్ర పాలకులు దశాబ్దాల పాటు చేసిన ప్రాపగాండను పటాపంచలు చేసి న్యూ ఏజ్ అడ్మినిస్ట్రేటర్ గా కేటీఆర్ ఎదిగిన తీరు రాబోయే తరాలకు బెంచ్ మార్క్ గా నిలుస్తుంది. తెలంగాణ వస్తే కంపెనీలు ఉండవు, పెట్టుబడులు రావు అన్నవాళ్ల గూబగుయ్యిమనేలా వరల్ టాప్ కంపెనీలను హైదరాబాద్ కు క్యూ కట్టించారు కేటీఆర్. సామాన్య జనంతో మాట్లాడే ఓర్పు, సిలికాన్ వ్యాలీ సీఈఓలతో మాట్లాడగలిగే నేర్పు ఉన్న ఏకైక రాజకీయనాయకుడు దేశం మొత్తం మీద ఒక్క కేటీఆర్ మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. సిలికాన్ వ్యాలీ నుంచి దవొస్ వరల్ ఎకనామిక్ ఫోరం వరకు ప్రశంసలు అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి అంటే అతిశయక్తి కాదు.

కేటీఆర్ అంటే ఎవరన్న ప్రశ్నకు తెలంగాణలో ఎన్నో సమాధానాలున్నాయి. అధికారం కోసం అన్నతో పంచాయితీ పెట్టుకుని తెలంగాణకు వలసొచ్చిన శ్రీమతి షర్మిలగారి కోసం ఆ సమాధానాలను మరొక్కసారి ఇక్కడ రాస్తున్నాను. తెలంగాణ గడపగడపలో ఎగజిమ్ముతున్న మిషన్ భగీరథ నల్లాను అడిగితే కేటీఆర్ ఎవరో చెపుతుంది. ఆడబిడ్డల నీటి కష్టం తీర్చడానికి మిషన్ భగీరథను ముందుండి నడిపిన మార్గదర్శి కేటీఆర్. తెలంగాణ పెద్ద పండుగ కోసం ఆడబిడ్డలకు ప్రభుత్వం పంపతున్న సారెను అడిగితే కేటీఆర్ ఎవరో చెపుతుంది. అటు నేతన్నల కడుపు నింపడంతో పాటు ఇటు ఆడపడుచుల పండుగ సంతోషంగా మారారు కేటీఆర్. మహిళా సాధికారికత కోసం పుట్టిన వీహబ్ ను అడిగితే కేటీఆర్ ఎవరో చెపుతుంది. వినూత్న ఆలోచనలతో భవిష్యత్తను మార్చాలనుకుంటున్న ఎందరో యువకుల కలల సాకారంగా వెలసిన టీహబ్ ను అడిగితే కేటీఆర్ ఎవరో చెపుతుంది.

అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఆపదలో ఉన్న ఎందరికో అందిన సాయాన్ని అడిగితే చెపుతుంది కేటీఆర్ అంటే ఎవరో.. కరోనా కష్టకాలంలో ఊపిరి ఆడని ఎందరికో అందిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అడిగితే చెపుతాయి కేటీఆర్ అంటే ఏంటో?ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా, ఒక కొడుకుగా, పాలకుడిగా ఈ పనులన్నింటినీ బాధ్యతతోనే కేటీఆర్ చేశారు గాని, మీరు అన్నట్టు పెద్ద మొగోడు అనుకుని మాత్రం చెయ్యలేదు. అందుకే తెలంగాణ ప్రజలకు కేటీఆర్ అంటే ఆత్మగౌరవ రూపం. ఆర్తినిండిన పాలనకు పర్యాయపదం. నడిపించే నాయకత్వం. స్పందించే మానవత్వం. అండగా ఉండే భరోసా. మొత్తంగా రేపటి కోసం ఇక్కడి ప్రజలకు కంటున్న సుందర స్వప్నం మా కేటీఆర్.

అధికారం, పదవి దక్కలేదన్న అక్కసుతో అన్నను వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టిన శ్రీమతి షర్మిల గారికి కేటీఆర్ పేరు తెలియడం కాదు అసలు ఆయన పెరెత్తే అర్హత ఏమాత్రం లేదు. ఉద్యమం కోసం పదవులను గడ్డిపోచల లెక్క వదులుకున్న చరిత్ర కేటీఆర్ ది. ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నాయకురాలిగా చెప్పుకుంటున్న దుస్థితిలో శ్రీమతి షర్మిల ఉంటే, రాజీనామా చేసిన ప్రతీసారి అంతకుమించి మెజార్టీతో ప్రజల ఆశీర్వాదాలు అందుకున్న సిసలైన నాయకుడు కేటీఆర్.
మనుషులకు మరుపు సహజమని నేను నమ్ముతాను. అందుకే శ్రీమతి షర్మిల గారు మీ మీద జాలి కలుగుతుంది. మీ అన్న కోసం మీరు చేసిన పాదయాత్ర సమయంలో మీరన్న మాటల్నీ గుర్తు తెచ్చుకోండి కేటీఆర్ అంటే ఎవరో తెలుస్తుంది.

ఇంకా మీ అన్నతో మాటలే ఉంటే ఆయన్ని అడిగినా చెపుతారు కేటీఆర్ అంటే ఎవరో. ఫేక్ వార్తలతో ఉక్కిరిబిక్కిరయి మీరు ప్రాధేయపడితే కేటీఆరే మీ పరువు నిలిపిన పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి. త్యాగాల ఈ గడ్డపై నిలబడే అర్హత సంపాదించాలంటే, ఇక్కడి ఉద్యమాల్ని, ఉద్యమ ఆకాంక్షల్ని, ఉద్యమకారుల్ని, ప్రజల్ని, పాలకుల్ని గుర్తుపట్టేంత కనీస జ్ఞానం సంపాదించుకోవాలి. మీలాంటి ఎందరో అజ్ఞానులకు, రాజకీయ జోకర్లకు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో తెలంగాణ సమాజం సమాధానం చెబుతూనే ఉంది. ప్రాంతం వాడు పొరపాటు చేస్తే క్షమించి సహిస్తాం… ప్రాంతీయేతరులు అహంకారంతో విర్రవీగుతే మాత్రం మీ అన్నను తరిమిన మానుకోట రాళ్లు మళ్లోసారి లేస్తాయి జాగ్రత్త.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News