హైదరాబాద్: హైదరాబాద్ లో సైక్లింగ్ ను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్‌తో కూడిన సైక్లింగ్ ట్రాక్‌కు మంత్రి కెటిఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. నానక్ రామ్ గూడ వద్ద మంత్రి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తొలిదశలో 23 కిలో మీటర్ల పొడువు, 4.5 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ద్వారా 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. నానక్ రామ్ గూడ నుంచి పోలీస్ అకాడమీ వరకు 8.5కిలో మీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరుకు 14.5 కిలో మీటర్లు వరకు సైకిల్ ట్రాక్ నిర్మిస్తామన్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
దక్షిణకొరియాకు బృందాన్ని పంపి సైకిల్ ట్రాక్ పరిశీలించామని వెల్లడించారు. సైకిల్ ట్రాక్ వల్ల ఐటి ఉద్యోగులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. సైకిల్ ట్రాక్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు. మోడల్ డెమో కింద 50 మీటర్లు సిద్ధం చేశామన్నారు. వచ్చే వేసివిలోగా పూర్తి చేసి నగరవాసులకు అందిస్తామని కెటిఆర్ తెలిపారు. దీంతో వికారాబాద్, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వాసులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. సైకిల్ ట్రాక్ లో భద్రత కోసం సిసి కెమెరాలు, ఫుడ్ కియోస్క్ లు, టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామని మంత్రి చెప్పారు. సైకిల్ రెంటల్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫుట్ పాత్ లపైకి వామనాలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సైకిల్ ట్రాక్ వెంబడి బారియర్లు, గ్రీన్ ప్లేస్ ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
MA&UD Minister @KTRTRS speaking after laying foundation stone for 23 km solar- roofed cycling track in Hyderabad https://t.co/0FCklywnMR
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 6, 2022