Monday, December 23, 2024

అందరికీ ఫిజికల్ ఫిటెనెస్‌పై ఆసక్తి పెరిగింది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Laid Foundation Stone to Cycling track

24 గంటలు ఈ ట్రాక్ అందుబాటులో ఉంటుంది
వచ్చే వేసవి కన్నా ముందే ఈ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం
రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహితమైన మోటార్ ట్రాన్స్‌పోర్ట్‌ను తీసుకురావాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌పై సోలార్ రూఫ్ టాఫ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి నానక్ రామ్‌గూడ వద్ద రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపి రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రెడ్‌కో చైర్మన్ సతీష్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రజా ఉపయోగమైన నాన్ మోటరైజ్ ట్రాన్స్‌ఫోర్ట్ సెల్యూషన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ట్రాక్‌కు శంకుస్థాపన చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. 160 కిలో మీటర్ల ఓఆర్‌ఆర్‌ను సరిగా ఉపయోగించుకోవడానికి ఈ సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుందన్నారు. విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారికి ఇంటి నుంచి ఆఫీస్‌కు, ఆఫీస్ నుంచి ఇంటికి అవసరమైతే బై సైక్లింగ్ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్ వెళ్లి రాకుండా ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం కూడా ఇది బాగుంటుందన్న ఆలోచోనతో దీనిని నిర్మిస్తున్నామన్నారు.

భవిష్యత్‌లో సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు….
ప్రస్తుతం అందరికీ ఫిజికల్ ఫిటెనెస్‌పై ఆసక్తి పెరిగిందన్నారు. 24 గంటలు ఈ ట్రాక్ అందుబాటులో ఉంటుందని, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలను ఉత్సాహాపరిచేలా భారత్‌లో తొలిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. శంకుస్థాపన చేయడంతో పాటు మోడల్ డెమో కింద 50 మీటర్లు తయారు చేశామన్నారు. జర్మనీ, సౌత్ కొరియా, ఇతర దేశాలకు ధీటుగా నాలుగున్నర మీటర్ల వైశాల్యంతో ప్రపంచ స్థాయి నిర్మించామన్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా దీనిని నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే వేసవి కన్నా ముందే నగరవాసులకు దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో సోలార్ రూఫ్‌తో కరెంట్ ఉత్పత్తి చేస్తామన్నారు. రెండోదశలో గండిపేట చుట్టూ 46 కిలో మీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, రిసార్ట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జీహెచ్‌ఎంసి పరిధిలో కూడా సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

సౌత్ కొరియా, దుబాయ్‌లకు వెళ్లి….
ఆరు నెలల క్రితం ఓ మిత్రుడు సౌత్ కొరియాలో సైక్లింగ్ ట్రాక్ ఉందని, హైవే మధ్యలో సోలార్ ప్యాన్లతో కట్టారని, చూడడానికి బాగుంటుందని హైదరాబాద్‌లో, తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని తనతో పేర్కొన్నారని కెటిఆర్ తెలిపారు. భారత్‌లో ఇప్పటివరకు దీనిని ఎవరూ ఏర్పాటు చేయలేదని, ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తన మిత్రుడు తనకు సూచించారన్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుచేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. దానికి అనుగుణంగా అధికారులను సౌత్ కొరియాకు వ్యక్తిగతంగా పంపామని, ఆ తర్వాత దుబాయికి కూడా వెళ్లి అక్కడ మోడల్‌ను స్టడీ చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News