Monday, December 23, 2024

నానమ్మ గుర్తుగా అక్షరాలయం

- Advertisement -
- Advertisement -

Minister KTR laying foundation stone for the school building in Konapur

సిఎం కెసిఆర్‌కు ఆస్తులు కొత్త కాదు, వందల ఎకరాలున్న ఇంట్లో పుట్టారు : మంత్రి కెటిఆర్

కామారెడ్డి జిల్లా కోనాపూర్‌లో రెండున్నర కోట్లతో స్కూల్ భవనానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: మా నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కెటి ఆర్ స్ఫష్టం చేశారు. నానమ్మ జ్ఞాపకార్థంగా రూ. 2.5 కోట్లతో గ్రామంలో నిర్మించబోయే స్కూల్ భవనానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కెటిఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోనాపూర్ గ్రామానికి రోడ్లు, వాటర్ ట్యాంక్, తాగునీటి కోసం 2 కిలోమీటర్ల పైపులైన్, బస్ షెల్టర్లు, డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు దళితబంధు పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ అంశాల్ను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంతో మంజూరు చేయిస్తానని కెటిఆర్ ప్రకటించారు. బీబీపేట్‌కు జూనియర్ కాలేజీని మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రాంతం మొత్తం ఒకప్పడు దుర్భిక్ష ప్రాంతం. ఇలాంటి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరందించి సస్యశ్యామలం చేశామని కెటిఆర్ తెలిపారు. ఏప్రిల్, మే నెల్ల్లో మానేరు మత్తడి దుంకుతుందని అనుకోలేదు. కానీ, ఇవాళ అది ఆవిష్కృతమైందని కెటిఆర్ పేర్కొన్నారు.

సోయి లేకుండా మాట్లాడుతున్నారు..

కొంతమంది రాజకీయ నాయకులు టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నారని కెటిఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని పట్టుకుని సోయి లేకుండా మాట్లాడుతున్నారు. కెసిఆర్ పుట్టిననాడే వందల ఎకరాల భూములున్న ఇంట్లో పుట్టిండు. ఆయనకు ఆస్తులు కొత్త కాదు. పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఫామ్ హౌజ్ అని పేరు పెట్టి, అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి సిఎం కావడం వల్లే రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. రూ.50వేల కోట్లతో రైతుబంధురూపంలో 63 లక్షల మంది రైతులకు ఇచ్చారు. రైతు ఏ కారణంగా చనిపోయినా కూడా రైతు బీమా కింద రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు.

మానేరుకు మాకు ఏదో అనుబంధం ఉంది.. పూర్వీకుల కథ చెప్పిన కెటిఆర్

మానేరు ప్రాజెక్టుకు తమ కుటుంబానికి ఏదో అనుబంధం ఉంది అని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెటిఆర్ పలు ఆసక్తికర విషయాలను కెటిఆర్ సభా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతం పట్ల తమకున్న అనుబంధం గురించి తెలియజేసేందుకు కెటిఆర్ తన పూర్వీకుల కథ చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మమ్మ (అమ్మమ్మ సోదరి)ది ఊరు కూడా లోయర్ మానేరులో మునిగిపోయిందని కెటిఆర్ గుర్తు చేశారు. నానమ్మ, అమ్మమ్మల జ్ఞాపకార్థంగా మన ఊరు మన బడి కార్యక్రమం కింద తన సొంత ఖర్చులతో పాఠశాలలను నిర్మిస్తున్నట్టు కెటిఆర్ వెల్లడించారు.

పోసనపల్లి గురించి నానమ్మే చెప్తుంటే విన్నదే తప్ప.. చూసింది లేదు

పోసనపల్లి గురించి నానమ్మ చెప్తుంటే విన్నదే తప్ప చూసింది లేదని కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు బీబీపేట్ వచ్చినా.. ఇక్కడికి రాలేకపోయాను. బీబీపేట్‌లో సుభాస్ రెడ్డి పాఠాశాల కట్టించినప్పుడు తాను కూడా పోసాన్‌పల్లిలో నానమ్మ జ్ఞాపకార్థం బడి కట్టిస్తానని హామీ ఇచ్చాను. అందులో భాగంగా మన ఊరుమన బడి కార్యక్రమం కింద నానమ్మ, అమ్మమ్మ ఊర్లలో స్కూళ్లను కట్టిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. నానమ్మ ఆత్మ శాంతించాల్ని, ఈ ఊరికి సొంతంగా మేలు చేసిన వాళ్లం కావాలని, ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఇది 80 ఏళ్ల కిందటి కథ..

ఈ ఊరితో ఉండే అనుబంధాన్ని కెటిఆర్ పంచుకున్నారు. 80 ఏళ్ల కిందటి కందటి కథ. నానమ్మ పోసాన్‌పల్లి, తాతది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట గ్రామం. అయితే నానమ్మ వాళ్లకు మగ పిల్లలు లేరు. పెళ్లి చేసేటప్పుడే అల్లుడిని ఇల్లరికం అడిగారు. రాఘవరావు గారు ఇక్కడివకే వచ్చేశారు. వ్యవసాయం చేసి ఇక్కడే స్థిరపడ్డారు. అప్పర్ మానేరు ప్రాజెక్ట్ అప్పటికీ కాలేదు. దాదాపు 45 ఏళ్లు వచ్చేవరకూ, అంటే అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టేదాకా ఇక్కడే ఉన్నారు. నలుగురైదుగురు పిల్లల్ని ఇక్కడే కన్నారు. ఈ చెరువు విస్తరించి మానేరు వాగు మీద అప్పర్ మానేరు డ్యాం కట్టాలని నిజాం నిర్ణయం తీసుకున్నప్పుడు చెరువు విస్తీరణలో వందల ఎకరాలు పోయాయి. 1940వ దశకంలో భూములు కోల్పోయారు. ఆనాటి రోజుల్లోనే భూమి కోల్పోయినందుకు రెండున్నర లక్షలు ఇచ్చింది. ఇప్పుడు ఆ విలువ కోట్ల రూపాయాల్లో ఉంటుందని కెటిఆర్ తెలిపారు.

పోసాన్‌పల్లి నుంచి చింతమడకకు..

ఇక పోసాన్‌పల్లి నుంచి సిద్దిపేటలోని చింతమడక గ్రామానికి తాత వెళ్లి ఐదారు వందల ఎకారాల భూమి కొన్నారు. కెసిఆర్ 1954లో చింతమడకలోనే పుట్టారు. ఆ పొలాల మధ్య ఇల్లు కట్టుకుంటే ఫాం హౌస్ అంటున్నారని విమర్శించారు. మానేరు వాగుకు మానేరు వాగుకు మాకూ ఏదో అనుబంధం ఉంది. మానేరు వాగు మీద మొదట ప్రాజెక్ట్ కట్టినప్పుడు నానమ్మ భూములు పోయాయి. మిడ్ మానేరు ప్రాజెక్ట్ కడితే అమ్మమ్మ ఊరు కుదురుపాక మునిగిపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News