ఖమ్మం: రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా ఆషామాషీగా తీసుకోవద్దని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నేతలతో కెటిఆర్ భేటీ అయ్యారు. పట్టబధ్రుల ఎంఎల్ సి, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలవడానికి విభేదాలు వీడి పనిచేయాలని పాత,కొత్త నేతలు కలిసి పార్టీని పటిష్టం చేయాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నాయకుల తీరుపై కెటిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విభేదాలు వీడి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలు హితబోధ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014, 2018 టిఆర్ఎస్ పార్టీ ఒక్కసీటే గెలిచిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలవాలని కెటిఆర్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజాప్రతినిధుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్ పద్ధతి మార్చుకోని పనిచేయాలని కొందరూ ఎంఎల్ఎలకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు.
ఎన్నిక ఏదైనా ఆషామాషీగా తీసుకోవద్దు: మంత్రి కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -