సంగారెడ్డిలోని మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250కోట్లతో ఏర్పాటు
మంత్రి కెటిఆర్‌తో ఎస్‌త్రీవి సంస్థ ప్రతినిధుల భేటీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రానికి మరో పెద్ద పెట్టుబడి రానుంది. న్యూరో, కార్డియాలజీ వైద్య ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఎస్ త్రివి సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ తమ యూనిట్‌ను సంగారెడ్డిలోని మెడికల్ డివైజెస్ పార్కులో సుమారు. 250 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, వైద్య పరికరాల హబ్‌కు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోందన్నారు. దీంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమన్నారు. ఒకవైపు అభివృద్ధి..మరోవైపు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూనే…పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్శించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందన్నారు.
పెట్టుబడి దారులకు ఎలాంటి ప్రయాస లేకుండా కేవలం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న కేవలం పదిహేను రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులను జారీ చేస్తోందన్నారు. ఈ విధానం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేదన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ పార్క్. 2017లో ప్రారంభించినప్పటి నుంచి ఎంతో వృద్ధిని సాధిం చామన్నారు. సుమారు రూ.1500 కోట్లు పెట్టుబడిగా రాగా మొ త్తం 7వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. ఈ విభాగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముం దుకొచ్చిన ఎస్‌త్రివి సంస్థ యజమాన్యాన్ని ఈ సందర్భంగా మం త్రి కెటిఆర్ అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ప్రతి రూ పాయికి పూర్తి భరోసా కల్పిస్తామన్నారు.
యూనిట్‌కు ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ సహకారాలను ప్రభుత్వ పక్షానఅందిస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇక్కడే పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు కెటిఆర్‌కు వివరించారు. తమ సంస్థ న్యూరో మెడికల్ డివైజెస్ నెక్స్ జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ డ్రగ్ కోటెడ్ క్రిటికల్ కేర్ క్యాథరర్స్‌ను తయా రు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ యూనిట్‌ను నెలకొల్పడం ద్వా రా ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.