Monday, December 23, 2024

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో మంత్రి కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

Minister KTR meets Union Minister Rajeev Chandrasekhar

హైదరాబాద్ : కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కెటిఆర్‌తో పాటు టిఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, సురేశ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐటి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన మంత్రి కెటిఆర్ ఈ భేటీ సహృదయపూర్వకమైన వాతావరణంలో సాగిందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతీయ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలో ఉన్న అవకాశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లుగా పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. మరో వైపు ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News