Monday, December 23, 2024

దావోస్‌ వేదికగా అరుదైన కలయిక.. ట్విటర్‌లో ఫోటోలు షేర్‌ చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Met AP CM Jagan In Davos

హైదరాబాద్: విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఇంకోవైపు మంత్రి కేటీఆర్‌ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News