Friday, December 20, 2024

జిహెచ్ఎంసి కార్పొరేటర్లతో మంత్రి కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భారత్ రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కార్పొరేటర్లతో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, హైదరాబాద్ అభివృద్ధికి చేస్తున్న కృషి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈ నెల 16న జిహెచ్ఎంసిలో వార్డు కార్యాలయాల ప్రారంభం కానున్నాయని మంత్రి వెల్లడించారు. వార్డు కార్యాలయాల ద్వారా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయన్నారు. వార్డు కార్యాలయాల వ్యవస్థ దేశంలోనే ఎక్కడా లేదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News