Thursday, January 23, 2025

ఇక తర్వాత… హిండెన్‌బర్గ్‌పై ఇడి దాడులేనా: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: దేశ రాజధానిలోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బిబిసి) కార్యాలయంపై మంగళవారం ఆదాయం పన్ను శాఖ(ఐటి) దాడులు నిర్వహించడంపై తెలంగాణ పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్ది వారాల తర్వాత బిబిసి ఇండియాపై ఐటి శాఖ దాడులు నిర్వహించిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఐటి, సిబిఐ, ఇడి వంటి కేంద్ర సంస్థలు బిజెపికి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయి నవ్వులపాలు అవుతున్నాయని కెటిఆర్ విమర్శించారు.

ఇక తర్వాత ఏమిటి&హిండెన్‌బర్గ్‌పై ఇడి దాడులా లేక బలవంతపు స్వాధీన ప్రయత్నమా అంటూ కెటిట్విటర్ వేదికగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమెరికాకకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ ఇటీవల అదానీ గ్రూపు కంఎపీలపై అక్రమాలపై నివేదికను ప్రకటించిన దరిమిలా ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. అదానీ గ్రూపును పెంచిపోషించింది ప్రధని నరేంద్ర మోడీయేనని, హిండెన్‌బర్గ్ నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) నియమించి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News