Sunday, December 22, 2024

నాలోని కొంత భాగాన్ని తీసుకెళ్తున్నాడంటూ కొడుకుపై మంత్రి కెటిఆర్…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అనునిత్యం ఎన్నో కార్యాక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ షేర్ చేస్తుంటారు. తాజాగా, తన కొడుకు హిమాన్షు తన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుండటంతో కెటిఆర్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘నిన్న మొన్నటి వరకు కళ్లముందే అల్లరిగా ఉండే ఈ పిల్లవాడు పెరిగి, కాలేజీకి వెళ్లడాన్ని నమ్మలేకపోతున్నా. నాలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడు’ అంటూ హిమాన్షు చిన్ననాటి ఫొటోలను ట్విట్టర్‌లో జతచేశారాయన. ఆయన కూడా కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తినట్లు సమాచారం. అక్కడి నుంచే ఆయన పనులను కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News