హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ ది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అన్నారు. పాలమూరులో అడుగుపెట్టే హక్కు బండి సంజయ్ కు లేదని కెటిఆర్ వార్నింగ్ ఇచ్చారు. కృష్టా జలాల్లో వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా.? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా? అని ప్రశ్నించారు. కుట్రలు చేసిన వాళ్లు.. ఇప్పుడు కపట యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. పాలమూరుపై కక్ష ఎందుకో సమాధానం చెప్పాలన్నారు. బిజెపికి విభజన హామీలు నెరవేర్చే తెలివి లేదని మంత్రి ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ చెప్పినా.. నిధులిచ్చే నీతి లేదని కెటిఆర్ ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తారా ? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బిజెపి అన్నారు. కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు చేస్తే ఏం లాభామని పేర్కొన్నారు. పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిదన్నారు. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పారు.
కపట యాత్రలు చేస్తే ఏం లాభం?: మంత్రి కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -