Friday, November 22, 2024

శుద్ధికూడిన ‘వృద్ధి’

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి
పర్యావరణానికి
హానికరం
కాకూడదు

నీరు, పారిశుద్ధ్య రంగాల్లో భవిష్యత్‌లో లక్షల ఉద్యోగాలు

దేశంలో యువత అపారంగా ఉంది
నూతన ఆవిష్కరణలకు మా
ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది,
వారి ఉత్పత్తులను ప్రభుత్వమే
కొంటుంది పారిశుద్ధ్య రంగంలో
పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం
జపాన్‌కు చెందిన డైకిన్ రాష్ట్రంలో
మూడో యూనిట్‌ను స్థాపిస్తుంది
ఇంక్ ఎట్ వాష్ కార్యక్రమంలో
మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి ముఖ్యమే కానీ, అది పర్యావరణానికి హాని చేసేలా ఉండకూడదని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నీరు, పారిశు ద్ధ్యం, హైజీన్ వంటి అంశాలు భవిష్యత్‌లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జపాన్‌కు చెందిన డైకిన్ సంస్థ తెలంగాణలో త్వరలో మూడో యూనిట్ ను స్థాపించనున్నట్టు ఆయన తెలిపారు. పురపాలకశాఖ ఆధ్వర్యంలో శానిటేషన్, హైజీన్‌లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ జరిగిన ఇంక్ ఎట్ వాష్ కార్యక్రమం హైదరాబాద్ ఐసిఐసిఐ బ్యాంక్ టవర్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ, ఇంక్‌వాష్ ఆధ్వర్యంలో శానిటేషన్, హైజీస్, న్యూ నాలెడ్జ్‌పై ఎగ్జిబిషన్ జరగ్గా, ఈ సదస్సులో పారిశుద్ధ్యం, మురుగుశుద్ధిపై పలువురు తమ ఆవిష్కరణలు ప్రదర్శించగా, పలు కొత్త ఇన్నోవేషన్‌లతో మున్సిపల్ శాఖతో సహా పలు సంస్థలు ఎంఓయూ చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పట్టణ జనాభా భారీగా పెరగనుందని, దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వానికి ఒక సవాల్ అని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. పట్టణాల నుంచి 45 శాతం జీఎస్‌డిపి ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

నూతన ఆవిష్కరణలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహాం

మన దేశ జనాభాలో యువత ఎక్కువగా ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం నూతన ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. పర్యావరణహిత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో పెట్టుబడులు, ఆవిష్కర్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కెటిఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలు, వ్యక్తులు, వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. ఉపాధితో పాటు చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కర్తలకు మొదటి వినియోగదారునిగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా తాము పెట్టుబడులు పెడతాం కానీ, ప్రైవేటు రంగం తమతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ ఆవిష్కర్తలను తీర్చిదిద్దే నగరం హైదరాబాద్ అని ఆయన తెలిపారు. భారత్‌లో ఎక్కడివారైనా సరే తెలంగాణకు వచ్చి వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని మంత్రి కెటిఆర్ ఆహ్వానించారు. కొత్త ఇన్నవేషన్‌లను ప్రోత్సహించడంతో పాటు వారి నుంచి తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు మంత్రి కెటిఆర్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News