Sunday, December 22, 2024

కాంగ్రెస్ వస్తే.. రాష్ట్ర పరిశ్రమలన్నీ కర్నాటకకు పోతాయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నో ఏళ్లు కష్టపడి తెలంగాణకు తెచ్చుకున్న ఫాక్స్ కాన్ లాంటి ప్రముఖ కంపెనీలను బెంగళూరు తరలించాలని డికె శివ కుమార్ కుట్ర చేసి లేఖలు రాస్తున్నాడని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆరోపించారు. జలవిహార్ న్యాయవాదుల ఆత్మయ సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని డికె శివకుమార్ అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిశ్రమలన్ని కర్నాటకకు పోతాయని తెలిపారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి ఉందన్నారు కెటిఆర్.

తెలంగాణ ఐటి ఎగుమతులు రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయన్న కెటిఆర్ 24 వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. కెసిఆర్ మళ్లీ సిఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కెసిఆర్ ది అన్నారు. హైదరాబాద్ లో ఉంటే.. అమెరికాలో ఉన్నట్లు ఉందని రజినీకాంత్ అన్నారని కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని బిజెపి ఎంపి సన్నిడియోల్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి అందరికి కనిపిస్తోంది కానీ… విపక్షాలకు కనిపించట్లేద అని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News