Sunday, December 22, 2024

కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్… కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు…  పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు ఉండేవని, రైతులు పొలాల్లో జాగారం చేసేవారని చెప్పారు. తాగునీటి సమస్య, సాగునీటి సమస్యతో జనం అల్లాడిపోయేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే కరెంటు లేని కాళరాత్రులు తప్పవని హెచ్చరించారు. బీడీ కార్మికులకు పింఛను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో నించోవలసిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆయన చెప్పారు. 65 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాలు పూర్తి చేయని ఎన్నో పనులను బీఆర్ఎస్ పూర్తి చేసిందని కేటీఆర్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News